భర్త మృతదేహం పక్కన్నే ప్రియుడితో భార్య..
దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా ఓ ఇల్లాలు కర్కశంగా వ్యవహరించింది. అగ్ని సాక్షిగా ఏడగులు నడిచిన ఆమె.. ప్రియుడి సాక్షిగా ఎనిమిది కత్తిపోట్లు పొడిచింది. భర్త చనిపోయాక.. సభ్య సమాజం తలదించుకునేలా శవాన్ని ఇంట్లోనే ఉంచి, ప్రియుడితో గడిపింది. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి మాయం చేయాలని చూసింది. అచ్చం క్రైం థ్రిల్లర్‌ను తలపించేలా సాగిన ఈ హత్య.. నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. భర్త కనిపించడం లేదని.. నిజామాబాద్‌లో ప్లాస్టిక్ పైపుల కంపెనీ […]
దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా ఓ ఇల్లాలు కర్కశంగా వ్యవహరించింది. అగ్ని సాక్షిగా ఏడగులు నడిచిన ఆమె.. ప్రియుడి సాక్షిగా ఎనిమిది కత్తిపోట్లు పొడిచింది. భర్త చనిపోయాక.. సభ్య సమాజం తలదించుకునేలా శవాన్ని ఇంట్లోనే ఉంచి, ప్రియుడితో గడిపింది. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి మాయం చేయాలని చూసింది. అచ్చం క్రైం థ్రిల్లర్‌ను తలపించేలా సాగిన ఈ హత్య.. నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.
భర్త కనిపించడం లేదని..
నిజామాబాద్‌లో ప్లాస్టిక్ పైపుల కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న నారాయణ కనిపించడం లేదని ఆయన భార్య శిరీష అక్టోబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అదే రోజు ఉదయం మోపాల్ మండలం మంచిప్ప అటవీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మృతదేహం స్థానికులకు కనిపించింది. ప్లాస్టిక్ సంచిలో ఉన్న ఆ మృతదేహం గురించి వారు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులకు.. మాంచిప్ప గ్రామంలోని ఇళ్ల ముందున్న సీసీ కెమెరాల్లో బైకుపై ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి మృతదేహాన్ని తరలించిన దృశ్యాలు కనిపించాయి.
పోలీసులకు అనుమానం వచ్చిందిలా..
మృతదేహంపై కత్తిపోట్లను గుర్తించిన పోలీసులు.. హత్యగా భావించి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. హతుడి బంధువులు, స్నేహితులను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వెంటనే భార్యను అదుపులోకి తీసుకోని తమదైన శైలీలో విచారించడంతో హత్య ఘటన వెలుగు చూసింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ప్రియుడితో కలిసి అంతమొందించినట్లు ఆమె పోలీసులు ముందు అంగీకరించింది.
భర్తను ఎలా చంపిందంటే..
అక్టోబర్ 26న మధ్యాహ్నం 12 గంటలకు ప్రియుడిని ఇంటికి పిలిచిన శిరీష.. భర్తపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసింది. ఛాతీ, కడుపులో 4 కత్తి పొట్లు పొడిచింది. అయినా ఇంకా చనిపోలేదని చెప్పడంతో.. బాయ్ ఫ్రెండ్ మరో నాలుగు కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. చంపిన తర్వాత 8 గంటల పాటు ఇంట్లోనే డెడ్ బాడీ పక్కన భార్య, బాయ్ ఫ్రెండ్ గడిపారు. ఆ మరుసటి రోజు మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో మూటకట్టారు. ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి మంచిప్ప అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పారేసి వచ్చారు. సీసీ కెమెరాలో మృతదేహం తరలిస్తున్న దృష్యాలు రికార్డు కావడంతో పోలీసులు కేసు ఛేదించారు. దీంతో భార్య, బాయ్ ఫ్రెండ్ కటకటాల పాలయ్యారు.