భర్తను ఇంట్లో బంధించి.. అదృశ్యమైన భార్య.. ఎక్కడికెళ్లిందంటే..?

దిశ, చార్మినార్​: డబ్బుల విషయమై తలెత్తిన వివాదంలో భర్తను ఇంట్లో బంధించి భార్య అనుమానస్పద స్థితిలో అదృశ్యమయిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో వెలుగుచూసింది. చాంద్రాయణగుట్ట ఏఎస్​ఐ కె.సుధాకర్​ బాబు తెలిపిన వివరాల ప్రకారం ..చాంద్రాయణగుట్ట దస్తగిరి నగర్​కు చెందిన మహ్మద్​ ఆదిల్​ తన మొదటి భార్యతో విడిపోయాక మూడేళ్ల క్రితం ముంబయికి చెందిన నజ్మీన్​ అన్సారీ(34)ని వివాహం చేసుకున్నాడు. అయితే నజ్మీన్​ అన్సారీ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరి మధ్య తరచు డబ్బుల విషయంలో […]

Update: 2021-08-25 02:54 GMT

దిశ, చార్మినార్​: డబ్బుల విషయమై తలెత్తిన వివాదంలో భర్తను ఇంట్లో బంధించి భార్య అనుమానస్పద స్థితిలో అదృశ్యమయిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో వెలుగుచూసింది. చాంద్రాయణగుట్ట ఏఎస్​ఐ కె.సుధాకర్​ బాబు తెలిపిన వివరాల ప్రకారం ..చాంద్రాయణగుట్ట దస్తగిరి నగర్​కు చెందిన మహ్మద్​ ఆదిల్​ తన మొదటి భార్యతో విడిపోయాక మూడేళ్ల క్రితం ముంబయికి చెందిన నజ్మీన్​ అన్సారీ(34)ని వివాహం చేసుకున్నాడు. అయితే నజ్మీన్​ అన్సారీ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరి మధ్య తరచు డబ్బుల విషయంలో వివాదం తలెత్తేది. దీంతో తన భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయేది. కాసేపటికే తిరిగి వచ్చేది.

ఈ నేపధ్యంలో ఈ నెల 22వ తేదీన రాత్రి మరో సారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. 23వ తేదీన ఉదయం వేళలో తన భర్త మహ్మద్​ ఆదిల్​ ఉన్న ఇంటికి బయటి నుంచి తాళాలు వేసి వెళ్లిపోయింది. భార్య ఆచూకి కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో 24వ తేదీన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును నమోదు చేసుకుని చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News