ఓ హత్య, మరో మరణం.. నోరువిప్పని ఇల్లాలు

దిశ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధం మోజులో పడిన ఓ మహిళ కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అనంతగిరిగుట్టల్లో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన చెన్నయ్య(38), శశికళ భార్యభర్తలు. వీరికి కొడుకు ప్రవీణ్, కూతురు పావని ఉన్నారు. చెన్నయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో శశికళ.. వరుసకు […]

Update: 2020-07-15 11:08 GMT

దిశ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధం మోజులో పడిన ఓ మహిళ కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అనంతగిరిగుట్టల్లో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన చెన్నయ్య(38), శశికళ భార్యభర్తలు. వీరికి కొడుకు ప్రవీణ్, కూతురు పావని ఉన్నారు. చెన్నయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో శశికళ.. వరుసకు మరిది అయ్యే వ్యక్తి రమేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీని గురించి తెలుసుకున్న చెన్నయ్య కొంతకాలంగా ఈ విషయమై గొడవ పడుతున్నాడు.

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నేపథ్యంలో భర్త చెన్నయ్యను అంతమొందించాలని శశికళ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే మద్యానికి బానిసైన చెన్నయ్యకు అనంతగిరిలో పసరు మందు ఇస్తారని, అది తాగితే తాగుడు మానేయొచ్చని శశికళ, రమేశ్‌లిద్దరూ నమ్మబలికారు. దీంతో ఈనెల 6న అతడిని వికారాబాద్‌కు బస్సులో తీసుకొచ్చారు. మార్గమధ్యలోనూ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే చెన్నయ్యకు మద్యం తాగించారు. అనంతరం అక్కడి నుంచి అనంతగిరికి చేరుకున్నారు. చెన్నయ్యకు మరోసారి పూటుగా మద్యం తాగించారు. అతడు స్పృహ కోల్పోగానే అక్కడి వాటర్ ట్యాంకు సమీపంలోని ఘాట్ వద్ద ఒక్కసారిగా లోయలోకి తోసేశారు.

అంతటితో ఆగకుండా అతడిపైకి రాళ్లు వేసి చంపేశారు. మృతదేహం ఎవ్వరికీ కన్పించకుండా చెట్ల కొమ్మలు, మట్టితో కప్పేశారు. అనంతరం ఎవరి దారిన వారు పోయారు. ఇదిలావుంటే.. నాలుగు రోజుల కిందట చెన్నయ్య తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఒక్కడే కొడుకు అయిన చెన్నయ్య కోసం సాయంత్రం వరకు ఎదురుచూశారు. అయినా ఫలితం లేకపోవడంతో అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు చేశారు. ఆదివారం చెన్నయ్య తల్లికి 3 రోజు కార్యక్రమాన్ని సైతం పూర్తి చేశారు. ఆ రోజు సాయంత్రమే పలువురు బంధువులు చెన్నయ్య విషయమై భార్య శశికళను ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానం చెప్పింది.

దీంతో అనుమానంతో రమేశ్‌ను గ్రామపెద్దల సమక్షంలో నిలదీశారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. బంధువులు, గ్రామస్తులు మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెండు పోలీసు స్టేషన్లకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. విషయం వెలుగులోకి రావడంతో చెన్నయ్య భార్య శశికళ తన స్వగ్రామంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News