జీవితాన్ని నాశనం చేసిన ఫ్రెండ్ రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఓ ఫ్రెండ్ రెక్వెస్ట్ ఆ యువతి జీవితాన్ని నాశనం చేసింది. అతడిని స్నేహితుడిగా అంగీకరించినందుకు ఆమెను ఏకాకిని చేశాడు. ఫేస్ బుక్ పరిచయం చివరకు పెటాకులు అయిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని తిమ్మాపురంకు చెందిన యువకుడు కాశి.. సమీపంలోని రామ్‌నగర్‌కు చెందిన జ్యోతికి ఫేస్ బుక్ ద్వారా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నాను అని చెప్పి పెండ్లి కూడా చేసుకున్నాడు. అతడిని గుడ్డిగా నమ్మిన జ్యోతి పెళ్లైన రెండు నెలల్లోనే మోసపోయానని […]
దిశ, వెబ్‌డెస్క్: ఓ ఫ్రెండ్ రెక్వెస్ట్ ఆ యువతి జీవితాన్ని నాశనం చేసింది. అతడిని స్నేహితుడిగా అంగీకరించినందుకు ఆమెను ఏకాకిని చేశాడు. ఫేస్ బుక్ పరిచయం చివరకు పెటాకులు అయిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని తిమ్మాపురంకు చెందిన యువకుడు కాశి.. సమీపంలోని రామ్‌నగర్‌కు చెందిన జ్యోతికి ఫేస్ బుక్ ద్వారా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నాను అని చెప్పి పెండ్లి కూడా చేసుకున్నాడు. అతడిని గుడ్డిగా నమ్మిన జ్యోతి పెళ్లైన రెండు నెలల్లోనే మోసపోయానని తెలుసుకుంది. రోజు కట్నం తీసుకురావాలని వేదిస్తుండడంతో పుట్టింటికి వెళ్లి గోడు వెల్లబోసుకుంది.
అయితే, కట్నం ఇవ్వడం లేదని కాశి ఏకంగా ఇంట్లో వాళ్లు చూసిన మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో జ్యోతి అతడిని నిలదీసిన ప్రయోజనం లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో హెచ్‌ఆర్సీని ఆశ్రయించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేసింది. దోర్నాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. కాశి నాయుడిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. తనను లైంగికంగా వాడుకొని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై హెచ్ఆర్సీ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటాంమని చెప్పారు.