కూర వద్దన్నాడని భర్తను కుమ్మేసిన భార్య
దిశ, వెబ్ డెస్క్: కష్టపడి వండిన కూర వద్దంటే ఏ భార్యకి కోపం రాడకుండా ఉంటుంది పాపం. కూర టేస్టీగా ఉందా లేదా? మొగుడు ఆ కూర తినొచ్చా లేదా? ఇవన్నీ సెకండరీ. భార్య వండితే తినాలి అంతే. లేకపోతే అప్పడాల కర్ర విరుగుతుందో, గరిటె నెత్తిపైన టంగుమని శబ్దం చేస్తుందో చెప్పలేము. ఎందుకంటే ఆడవాళ్లు జస్ట్ కొద్దిగా గడుసుతనంతో ఉంటారు మరి. అహ్మదాబాద్ లోని వాస్నా ప్రాంతంలో హర్షద్ గోయల్, తారా గోయల్ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: కష్టపడి వండిన కూర వద్దంటే ఏ భార్యకి కోపం రాడకుండా ఉంటుంది పాపం. కూర టేస్టీగా ఉందా లేదా? మొగుడు ఆ కూర తినొచ్చా లేదా? ఇవన్నీ సెకండరీ. భార్య వండితే తినాలి అంతే. లేకపోతే అప్పడాల కర్ర విరుగుతుందో, గరిటె నెత్తిపైన టంగుమని శబ్దం చేస్తుందో చెప్పలేము. ఎందుకంటే ఆడవాళ్లు జస్ట్ కొద్దిగా గడుసుతనంతో ఉంటారు మరి.
అహ్మదాబాద్ లోని వాస్నా ప్రాంతంలో హర్షద్ గోయల్, తారా గోయల్ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు కామన్. ఒకరోజు తార చపాతీల్లోకి బంగాళదుంప కూర వండింది. తనకు షుగర్ ఉందని, ఈ కూర తింటే షుగర్ పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు వండావ్ అంటూ భార్యపై అరిచాడంట హర్షద్. దీంతో తారకు పట్టరాని కోపం వచ్చింది. కష్టపడి వంట చేస్తే వద్దంటావా అని బట్టలు ఉతికేందుకు ఉపయోగించే కర్రను తీసుకొచ్చి భర్తను చితక్కొట్టింది.
దీంతో భయపడిన భర్త పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి అతడిని రక్షించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అతని కుడిచేయి భుజం విరిగినట్టు తేలింది. తన భార్యపై చర్యలు తీసుకోవాలంటూ ఆ భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీనిని బట్టి భార్య ఏమైనా కష్టపడి వండిపెడితే వద్దు అని చెప్పడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి, తగిన జాగ్రత్తలు తీసుకొని చెప్పడం బెటర్, కదా…!!