బంగారం ఇవ్వమన్నందుకు దారుణ హత్య..

దిశ, ఏపీబ్యూరో : కరోనా నేపథ్యంలో బతుకు భారమై పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరోవైపు పైసల కోసం కుటుంబంలో కలహాల చెలరేగి హత్యలకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కలపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. నక్కలపల్లికి చెందిన గోపీనాథ్‌రెడ్డి (36)కి అదే గ్రామానికి చెందిన తన అత్తకూతురు సునీతతో పదమూడేండల్ కిందట వివాహం జరిగింది. వీరికి తొమ్మిదేండ్ల కుమారుడు ఉన్నాడు. గోపీనాథ్‌రెడ్డి కొన్నేళ్ల కిందట బెంగళూరులో క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. […]

Update: 2020-07-23 02:15 GMT

దిశ, ఏపీబ్యూరో :
కరోనా నేపథ్యంలో బతుకు భారమై పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరోవైపు పైసల కోసం కుటుంబంలో కలహాల చెలరేగి హత్యలకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కలపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. నక్కలపల్లికి చెందిన గోపీనాథ్‌రెడ్డి (36)కి అదే గ్రామానికి చెందిన తన అత్తకూతురు సునీతతో పదమూడేండల్ కిందట వివాహం జరిగింది. వీరికి తొమ్మిదేండ్ల కుమారుడు ఉన్నాడు. గోపీనాథ్‌రెడ్డి కొన్నేళ్ల కిందట బెంగళూరులో క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా నాలుగు నెలల కిందట నక్కలపల్లికి వచ్చి అత్తారింట్లోనే ఉంటున్నాడు. ఫైనాన్స్ చెల్లించకపోవడంతో కంపెనీ అతని కారును తీసుకెళ్లిపోయింది. దీంతో వర్షాకాలం కావడంతో వ్యవసాయపనులు ఉంటాయని భావించి, ఉపాధి కోసం ట్రాక్టర్ కొనుక్కోవాలని భావించాడు. ట్రాక్టర్ కొనేందుకు నగలు ఇవ్వాలని భార్యను అడిగాడు. ఆమె అందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే వీరిమధ్య ఘర్షణ నెలకొంది. మరుసటి రోజు కూడా ఇదే విషయంలో మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన అతని భార్య క్రికెట్ బ్యాట్‌తో, అత్త రోకలి బండతో గోపినాథ్ రెడ్డి పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News