పంత్ సహా మరొకరికి పాజిటివ్.. క్లారిటీ ఇచ్చిన BCCI
దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్ ఇండియా జట్టులో కరోనా కలకలం సృష్టించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమ్ ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ 20 రోజుల సెలవులు మంజూరు చేసింది. దీంతో బయోబబుల్ దాటి క్రికెటర్లు బయట పర్యటిస్తూ సెలవులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సెలవులే క్రికెటర్ల పాలిట శాపంగా మారాయి. టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్, సహాయక సిబ్బంది దయానంద గారాని కరోనా బారిన పడ్డారు. అయితే, గారానికి […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్ ఇండియా జట్టులో కరోనా కలకలం సృష్టించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమ్ ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ 20 రోజుల సెలవులు మంజూరు చేసింది. దీంతో బయోబబుల్ దాటి క్రికెటర్లు బయట పర్యటిస్తూ సెలవులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సెలవులే క్రికెటర్ల పాలిట శాపంగా మారాయి.
టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్, సహాయక సిబ్బంది దయానంద గారాని కరోనా బారిన పడ్డారు. అయితే, గారానికి సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా సహా మరొకరు సన్నిహితంగా ఉండటం వల్ల ఈ ముగ్గురిని ఐసోలేషన్‌లోకి పంపారు. క్రికెటర్లకు కరోనా సోకినట్టు బీసీసీఐ అధికారికంగా ట్విట్టర్‌రో పేర్కొంది.
https://twitter.com/BCCI/status/1415660631752024068?s=20