ఐప్యాడ్‌లో ఇన్‌స్టాగ్రాం యాప్ లేని కారణం ఇదే!
సాధారణంగా ఏదైనా యాప్ తయారు చేసే ముందు డెవలపర్లు దాన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్‌లలో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మూడు రకాల వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా వెర్షన్లు విడుదల చేస్తారు. అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్‌స్టాగ్రాం యాప్‌కి ఐప్యాడ్ వెర్షన్ ఇప్పటికీ లేకపోవడం గమనార్హం. అయితే ఈ విషయాన్నే ఇన్‌స్టాగ్రాం సీఈఓ ఆడమ్ మొస్సేరీని అడిగితే ఆయన చెప్పిన సమాధానం అందరికీ రుచించలేదు. “మా దగ్గర చాలా మంది ఉన్నారు. మాకు చాలా పనులున్నాయి. కానీ […]
సాధారణంగా ఏదైనా యాప్ తయారు చేసే ముందు డెవలపర్లు దాన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్‌లలో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మూడు రకాల వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా వెర్షన్లు విడుదల చేస్తారు. అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్‌స్టాగ్రాం యాప్‌కి ఐప్యాడ్ వెర్షన్ ఇప్పటికీ లేకపోవడం గమనార్హం. అయితే ఈ విషయాన్నే ఇన్‌స్టాగ్రాం సీఈఓ ఆడమ్ మొస్సేరీని అడిగితే ఆయన చెప్పిన సమాధానం అందరికీ రుచించలేదు.
“మా దగ్గర చాలా మంది ఉన్నారు. మాకు చాలా పనులున్నాయి. కానీ ఆ పనుల్లో ఐప్యాడ్ వెర్షన్ తయారీకి అంత ప్రాధాన్యం లేదు” అని ఆడమ్ అన్నారు. చిన్న చిన్న సంస్థలు అన్ని వెర్షన్లలోనూ యాప్‌లను విడుదల చేస్తుంటే, ఇన్‌స్టాగ్రాం లాంటి యాప్‌కు ఐప్యాడ్ వెర్షన్ లేకపోవడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం ఐప్యాడ్ వినియోగదారులు ఇతర థర్డ్ పార్టీల ద్వారా ఇన్‌స్టాగ్రాం ఉపయోగిస్తున్నప్పటికీ నేటివ్ యాప్‌లో ఉన్న ఫీచర్లన్నీ అందులో వినియోగించుకోలేపోతున్నారు. ఇప్పటికి పదేళ్లు గడిచినప్పటికీ ఇంకా ఐప్యాడ్ వెర్షన్ అందుబాటులో లేకపోవడానికి సరైన కారణం ఏంటో సీఈఓ కూడా అడ్డదిడ్డంగా చెప్పడంతో నెటిజన్లు నిరాశపడ్డారు.