న్యాయ వ్యవస్థపై బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి.. సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్

న్యాయ వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) అన్నారు.

Update: 2025-03-25 08:01 GMT
న్యాయ వ్యవస్థపై బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి.. సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: న్యాయ వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ అంశం (Delhi High Court justice Yashwanth Varma Issue)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. బీజేపీ (BJP)కి అనుకూలంగా వ్యవహరించే జడ్జీలు ఉన్నత పదవులకు వెళ్తున్నారని, రాజ్యసభ పదవులు (Rajya sabha Members), గవర్నర్లు (Governors) అవుతున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ (PM Modi) అధికారంలోకి వచ్చాక జ్యూడీషియరీ (Judiciary) పైన నాగుపాము పడగ పెట్టి, ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

కొలీజియం మీద కూడా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని, దాని తర్వాత వచ్చిన పర్యావసనాల వల్ల.. కేంద్ర ప్రభుత్వం అవినీతికి జొప్పించి ప్రమోషన్లు ఇస్తున్న నేపథ్యంలో మనం కూడా చేయోచ్చనే భావన న్యాయ వ్యవస్థలో వస్తోందని అన్నారు. జస్టిస్ వర్మ డబ్బుల కట్టల వ్యవహారం న్యాయ వ్యవస్థకు కళంకం అని, వర్మ అవినీతికి పాల్పడ్డారని అనడానికి బయటపడ్డ నోట్ల కట్టలే నిదర్శనమని తెలిపారు. వర్మను హైకోర్టు ఎంట్రన్స్ ముందు సోఫాలో కూర్చోబెట్టి పని ఇవ్వకుండా పనిష్మెంట్ ఇవ్వాలని సీపీఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ దొరికాడు కాబట్టి దొంగ అయ్యాడని, ఇంకా దొరకని దొంగలు చాలా మందే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల న్యాయవ్యవస్థే కాదు.. మిగిలిన వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయని, ఇది చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ప్రజలకు అంతో ఇంతో గౌరవం కోర్టులపైనే ఉంటుందని, కానీ కోర్టులే ఇలా అయిపోతే ఎవరికి చెప్పుకుంటారని అన్నారు. దీనికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు పలకాల్సిన అవసరం ఉందని నారాయణ తెలిపారు.

Tags:    

Similar News