కరోనా వల్ల ఎక్కువ చనిపోతున్నది మగవాళ్లేనా? ఎందుకు?

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 కారణంగా చనిపోతున్నవాళ్లలో ఆడవాళ్ల కంటే ఎక్కువగా మగవాళ్లే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్‌ని మొదటిసారిగా చైనాలో గమనించారు. తర్వాత కొవిడ్ 19 మరణాల రేటు ఎక్కువగా ఉన్న జర్మనీ, స్పెయిన్, దక్షిణ కొరియా వంటి 33 దేశాల్లో కూడా అధికారిక లెక్కలు చూస్తే ఇదే విషయం తేలింది. దీని వెనక కారణాల గురించి నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌కి చెందిన ఆరోగ్య ఈక్విటీ రీసెర్చ్ సంస్థ […]

Update: 2020-04-30 06:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 కారణంగా చనిపోతున్నవాళ్లలో ఆడవాళ్ల కంటే ఎక్కువగా మగవాళ్లే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్‌ని మొదటిసారిగా చైనాలో గమనించారు. తర్వాత కొవిడ్ 19 మరణాల రేటు ఎక్కువగా ఉన్న జర్మనీ, స్పెయిన్, దక్షిణ కొరియా వంటి 33 దేశాల్లో కూడా అధికారిక లెక్కలు చూస్తే ఇదే విషయం తేలింది. దీని వెనక కారణాల గురించి నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు.

యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌కి చెందిన ఆరోగ్య ఈక్విటీ రీసెర్చ్ సంస్థ గ్లోబల్ హెల్త్ 50-50 వారు చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. అయితే కారణాల గురించి వైద్యనిపుణులు ఏం చెప్తున్నారంటే….

మహిళలకు వ్యాధినిరోధక శక్తి ఎక్కువ. మగవాళ్లతో పోలిస్తే ముఖ్యంగా సాంక్రమిక వ్యాధులను నిరోధించగలడంలో వారి శరీరం చక్కని నిరోధక శక్తిని చూపిస్తుందని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ సబ్రా క్లీన్ తెలిపారు. వీటికి ప్రధాన కారణం సెక్స్ హార్మోన్స్ అని ఆమె అన్నారు. ఆడవాళ్లలో ఉండే ఈస్ట్రోజన్, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని, మగవాళ్లలో ఉన్న టెస్టోస్టీరాన్ వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుందని ఆమె చెప్పారు. హార్మోన్స్ వాటి పని చేయడానికి కణాలతో మమేకం కలవాల్సి ఉంటుంది. ఇక్కడ కణాలకు తాళం ఉంటే, హార్మోన్లు తాళం చెవి అన్నమాట. ఈ విషయంలో ఈస్ట్రోజన్ ఉన్నంత క్రియాశీలకంగా టెస్టోస్టీరాన్ ఉండదు.

ఇక క్రోమోజోములు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయని సబ్రా అన్నారు. ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులను నిరోధించడంలో 60 జన్యువులు ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ క్రోమోజోమ్ మగవాళ్లలో ఒక్కటే ఉంటుంది, కానీ ఇదే క్రోమోజోమ్ ఆడవాళ్లలో రెండు ఉంటాయి. వారి వ్యాధినిరోధక శక్తి వెనక ఇది కూడా ఒక కారణం అయ్యుండవచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. అయితే కొవిడ్ 19 విషయంలో కూడా ఈ క్రోమోజోములు, హార్మోన్లే ప్రధాన పాత్ర పోషించాయని ధ్రువీకరించాలంటే ఇంకా చాలా డేటా కావాల్సి ఉంది.

Tags – corona, covid, men, women, chromosomes, data, record, china

Tags:    

Similar News