Mpox Vaccine : ఇక పూణేలో మంకీపాక్స్ వ్యాక్సిన్ల తయారీ
దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం మంకీపాక్స్ కలకలం రేపుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఈ తరుణంలో ఒక గుడ్ న్యూస్ వినిపించింది. డెన్మార్క్‌కు చెందిన వ్యాక్సిన్ కంపెనీ ‘బవేరియన్ నార్డిక్’(Bavarian Nordic) తయారు చేసిన మంకీపాక్స్ టీకా(Mpox vaccine) ‘ఎంవీఏ - బీఎన్’ ఇక మనదేశంలోనూ తయారు కానుంది.
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(Serum Institute)లో ‘ఎంవీఏ - బీఎన్’ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నారు. ఈమేరకు ‘బవేరియన్ నార్డిక్’, సీరం ఇన్‌స్టిట్యూట్ కంపెనీల మధ్య సోమవారం రోజు వ్యాక్సిన్ లైసెన్సింగ్, తయారీ ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా ‘ఎంవీఏ - బీఎన్’ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేసి, విక్రయించుకునే హక్కులు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు లభించాయి.