ఎస్ఆర్ఎస్పీ కాలువకు భారీ గండి

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లా హన్మకొండలో ఎస్ఆర్ఎస్పీ కాలువకు భారీ గండి పడింది. దీంతో గుడ్ల సింగారం, పెగడపల్లి, ఇందిరమ్మ కాలనీలు నీట మునిగాయి. మరో మూడు కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది. కాలువకు గండి పడడంతో నీరు భారీ ఎత్తున వృధాగా పోతున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు.. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో భారీ ముప్పు తప్పింది. ఎస్సారెస్పీ కాలువ‌కు గండి ప‌డ‌టంపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ స్పందించారు. […]

Update: 2021-01-05 01:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లా హన్మకొండలో ఎస్ఆర్ఎస్పీ కాలువకు భారీ గండి పడింది. దీంతో గుడ్ల సింగారం, పెగడపల్లి, ఇందిరమ్మ కాలనీలు నీట మునిగాయి. మరో మూడు కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది. కాలువకు గండి పడడంతో నీరు భారీ ఎత్తున వృధాగా పోతున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు.. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో భారీ ముప్పు తప్పింది.

ఎస్సారెస్పీ కాలువ‌కు గండి ప‌డ‌టంపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ స్పందించారు. గండిని పూడ్చేందుకు వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, నీటి ముప్పును నివారించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు. స్థానికుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని తెలిపారు.

Tags:    

Similar News