రాణిస్తుందా?.. పోగొట్టుకుంటుందా?
దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో టీమిండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలవగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు రాణించినా.. బౌలర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు విజృంభించారు. దీంతో రెండో వన్డేలో టీమిండియాను ఇంగ్లండ్ చిత్తుచేసింది. సిరీస్ సమం కావడంతో.. మూడో వన్డే అత్యంత కీలకంగా మారింది. మూడు వన్డేల సిరీస్ మాత్రమే కావడంతో.. ఈ మూడో మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతమవుతుంది. దీంతో […]
దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో టీమిండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలవగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు రాణించినా.. బౌలర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు విజృంభించారు. దీంతో రెండో వన్డేలో టీమిండియాను ఇంగ్లండ్ చిత్తుచేసింది. సిరీస్ సమం కావడంతో.. మూడో వన్డే అత్యంత కీలకంగా మారింది.
మూడు వన్డేల సిరీస్ మాత్రమే కావడంతో.. ఈ మూడో మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతమవుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. భారత పర్యటనలో భాగంగా టెస్టు, టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్.. కనీసం వన్డే సిరీస్‌ను అయినా ఇంటికి తీసుకెళ్లాలనే కసితో ఉంది.
ఇక మూడో వన్డేలో గెలిచి వన్డే సిరీస్‌ను కూడా గెలుచుసుకోవాలనే నిశ్చయంతో టీమిండియా బరిలోకి దిగుతుంది. టీమిండియా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ బలంగా ఉండగా.. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కలవరపరుస్తోంది. అటు ఇంగ్లండ్ టీమ్ రెండు వైపులా బలంగా ఉంది. మరి ఈ కీలక పోరులో టీమిండియా నెగ్గుతుందా?.. లేదా? అనేది చూడాలి.