గేమింగ్ కంపెనీలతో డబ్ల్యూహెచ్‌వో భాగస్వామ్యం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారిని తగ్గించడానికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే నివారణ చర్య. అయితే ఇంట్లో కదలకుండా కూర్చోబెట్టగల ఒకే ఒక వ్యాపకం వీడియో గేములు. వీడియో గేములు ఆడేవారు రోజుల తరబడి ఒకే చోట కూర్చొని ఆన్‌లైన్‌లో ఆటలు ఆడుతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రముఖ వీడియోగేమ్ కంపనీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. ఇంట్లోనే ఉండి వీడియోగేములు ఆడేలా ప్రజలను ఎంకరేజ్ చేయడానికి […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారిని తగ్గించడానికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే నివారణ చర్య. అయితే ఇంట్లో కదలకుండా కూర్చోబెట్టగల ఒకే ఒక వ్యాపకం వీడియో గేములు. వీడియో గేములు ఆడేవారు రోజుల తరబడి ఒకే చోట కూర్చొని ఆన్‌లైన్‌లో ఆటలు ఆడుతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రముఖ వీడియోగేమ్ కంపనీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది.
ఇంట్లోనే ఉండి వీడియోగేములు ఆడేలా ప్రజలను ఎంకరేజ్ చేయడానికి డబ్ల్యూహెచ్‌వో వీడియో గేమ్ కంపెనీలతో భాగస్వామ్యం పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వీడియోగేమ్ కంపెనీలకు ఉచిత పబ్లిసిటీ దొరికే అవకాశం ఉండటంతో అవి కూడా ముందుకొచ్చాయి. గతంలో వీడియోగేములు అతిగా ఆడటాన్ని జబ్బుగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో, ఇప్పుడు ప్రపంచ మహమ్మారిని పారద్రోలడానికి వీడియో గేమ్ కంపెనీల సహాయం తీసుకోవడాన్ని ఆయా కంపెనీలు స్వాగతించాయి. డబ్ల్యూహెచ్‌వోతో ఒప్పందం గురించి రాయిట్ గేమ్స్, ఆక్టివిజన్ కంపెనీలు ప్లే అపార్ట్ టుగెదర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేశాయి. ఈ ట్వీట్లలో కొవిడ్ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేశారు.
Tags : Corona, Covid 19, Video games, who, world health organisation, social distancing