ఆ 43మందికి కరోనా పరీక్షలు చేయిస్తాం..
దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 43మందికి కరోనా పరీక్షలు చేయిస్తామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పష్టంచేశారు. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి గత పదేండ్ల కిందటే గ్రామాన్ని వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలసొచ్చాడు.ఈ మధ్యే అతనికి కరోనా పాజిటివ్ రావడంతో నగరంలో చికిత్స పొందుతూ మరణించాడు.విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి […]
దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 43మందికి కరోనా పరీక్షలు చేయిస్తామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పష్టంచేశారు. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి గత పదేండ్ల కిందటే గ్రామాన్ని వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలసొచ్చాడు.ఈ మధ్యే అతనికి కరోనా పాజిటివ్ రావడంతో నగరంలో చికిత్స పొందుతూ మరణించాడు.విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంతక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు హాజరైన 43 మంది వ్యక్తులను గుర్తించామని, వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.