కాంగ్రెస్‌లో కలవరం.. హుజురాబాద్‌ అభ్యర్థి మార్పులో ఆ ముగ్గురి పాత్ర.?

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగబోతోంది..? అభ్యర్థి ఎంపిక విషయంలోనే తర్జన భర్జనలు పడుతున్న పీసీసీ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకుంటుందా లేక చతికిల పడుతుందా అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. మొదట కొండా సురేఖతో పాటు ముగ్గురి పేర్లను అధిష్టానికి పంపించిన పీసీసీ వెనక్కి తగ్గింది. ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ముగ్గురి వాదనలతోనేనా..? హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీ దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, […]

Update: 2021-09-05 08:54 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగబోతోంది..? అభ్యర్థి ఎంపిక విషయంలోనే తర్జన భర్జనలు పడుతున్న పీసీసీ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకుంటుందా లేక చతికిల పడుతుందా అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. మొదట కొండా సురేఖతో పాటు ముగ్గురి పేర్లను అధిష్టానికి పంపించిన పీసీసీ వెనక్కి తగ్గింది. ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ముగ్గురి వాదనలతోనేనా..?

హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీ దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. నాన్ లోకల్ వాళ్లకు ఇస్తే ఎలా అన్న వాదన తీసుకరావడంతో ఔత్సాహిక అభ్యర్థులు ఆదివారం నాటికల్లా దరఖాస్తులు చేసుకోవాలని గడువు విధించారు. ఈ క్రమంలో 18 మంది ఆశావాహులు తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని డీసీసీ కార్యాలయంలో అప్లికేషన్లు పెట్టారు.

దీంతో అభ్యర్థి ఎంపిక కొలిక్కి వస్తుందా.? లేదా అన్నదే మిస్టరీగా మారింది. నిన్న మొన్నటి వరకు పోటీ చేసే అభ్యర్థులే లేరనుకున్న అధిష్టానికి 18 మంది దరఖాస్తు చేసుకోవడంతో వారిని మెప్పించి ఒప్పించడం ఎలా? అన్నదే తల నొప్పిగా మారనుంది. అంతేకాకుండా వీరిలో బలమైన నాయకుడు ఎవరు అన్న విషయం కూడా తేల్చాల్సిన ఆవశ్యకత అధిష్టానంపై పడింది.

జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత ఆశీస్సులు ఉన్న హుజురాబాద్ నాయకుడు ఇప్పటికే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వద్దకు వెళ్లి తననే అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. మరో వైపున ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇప్పట్లో విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో దరఖాస్తుల గడువును పెంచుతారన్న చర్చ కూడా సాగుతోంది. హుజురాబాద్ విషయంలో పీసీసీ ఎలా వ్యవహరిస్తుందోనన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

Tags:    

Similar News