8ఏళ్ల చిన్నారిలా కనిపిస్తున్న 22 ఏళ్ల యువతి!
దిశ, ఫీచర్స్ : అమెరికాకు చెందిన ‘షానా రే’ పుట్టిన ఆరు నెలలకే బ్రెయిన్ క్యాన్సర్ బారినపడటంతో, వైద్యులు కీమోథెరపీ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే కీమోథెరపీ వల్ల పిట్యూటరీ గ్రంథికి నష్టం కలగడంతో ఆమె ఎదుగుదల ఆగిపోయిందని నిపుణులు భావిస్తున్నారు. కానీ దీనికి కచ్చితమైన ఆధారాలు లేకపోగా.. క్యాన్సర్ చికిత్స కారణంగా కొంతమంది రోగులలో ఎండోక్రైన్ సమస్య(చిన్నవయసు నుంచి వృద్ధాప్యం వరకు శరీరంలోని అన్ని జీవ ప్రక్రియలను నియంత్రిస్తుంది)లు ఉత్పన్నమయ్యే అవకాశాలుంటాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో […]
దిశ, ఫీచర్స్ : అమెరికాకు చెందిన ‘షానా రే’ పుట్టిన ఆరు నెలలకే బ్రెయిన్ క్యాన్సర్ బారినపడటంతో, వైద్యులు కీమోథెరపీ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే కీమోథెరపీ వల్ల పిట్యూటరీ గ్రంథికి నష్టం కలగడంతో ఆమె ఎదుగుదల ఆగిపోయిందని నిపుణులు భావిస్తున్నారు. కానీ దీనికి కచ్చితమైన ఆధారాలు లేకపోగా.. క్యాన్సర్ చికిత్స కారణంగా కొంతమంది రోగులలో ఎండోక్రైన్ సమస్య(చిన్నవయసు నుంచి వృద్ధాప్యం వరకు శరీరంలోని అన్ని జీవ ప్రక్రియలను నియంత్రిస్తుంది)లు ఉత్పన్నమయ్యే అవకాశాలుంటాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో షానా రే.. 22 ఏళ్లు వచ్చినా, 8 ఏళ్ల చిన్నారిలా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె లైఫ్‌స్టోరీపై అమెరికన్ పే టెలివిజన్ చానల్ ‘టీఎల్‌సీ’ ‘ఐ యామ్ షానా రే’ అనే డాక్యుమెంటరీ రూపొందించింది.
అతి ప్రమాదకర క్యాన్సర్ నుంచి షానా బయటపడింది కానీ ఆమె ఎదుగుదలలో మాత్రం కొన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. 3 అడుగుల 10 అంగుళాల పొడవు మాత్రమే ఉన్న షానాను చూస్తే 8ఏళ్ల చిన్నారిలా కనిపిస్తుంది. కానీ ఈ యువతి పెద్దవాళ్లలా వ్యవహరించాలని కోరుకుంటుంది. బార్‌లో మద్యం సేవించడం, టాటూ వేయించుకోవడం, బ్లైండ్ డేట్‌కు వెళ్లడం వంటి సగటు టీనేజర్‌లా వ్యవహరించాలని కోరుకుంటుండగా.. తన లుక్ వల్ల ఆ పనులను ధైర్యంగా చేయలేకపోతుంది. ఈ క్రమంలోనే ఆమె రోజూవారీ కష్టాలను, షానా ప్రయాణాన్ని సమాజానికి తెలియజేసేందుకు ‘టీఎల్‌సీ’.. ‘ఐ యామ్ షానా రే’ డాక్యుమెంటరీని తీసింది. ఇటీవలే దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. షానా షో TLCలో జనవరి 11, 2022న ప్రీమియర్ కానుంది. ‘నన్ను చూస్తే మీరు చిన్న అమ్మాయినని అనుకోవచ్చు కానీ నేను 22 ఏళ్ల మహిళను. అందరిలానే నేను కూడా ఎంజాయ్ చేయాలని భావిస్తున్నా. స్వతంత్రంగా బతకాలని కోరుకుంటున్నా. అందుకోసం కొంత రిస్క్ తీసుకోవాల్సిందే’ అని షానా తెలిపింది.
షానా కథ ప్రత్యేకమైనది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం. జు షెంగ్‌కై అనే 34 ఏళ్ల వ్యక్తి కూడా తన చిన్నతనంలో తలకు గాయం కావడంతో ఇప్పటికీ చిన్న పిల్లోడిలానే కనిపిస్తున్నాడు. అయితే ఇలాంటి కేసులు అరుదుగా కనిపిస్తుంటాయి.