కోట్లు కొల్లగొడుతున్న.. ఎనిమిదేళ్ల చిన్నోడు

దిశ, వెబ్‌డెస్క్ : చిన్నారులకు బొమ్మలతో ఆడుకోవడమంటే.. మహా సరదా. ర్యాన్ కాజీ అనే బుడ్డోడికి కూడా బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే, అందరి పిల్లల్లా ఆడుకోవడంతోనే వాటిని విడిచిపెట్టలేదు కాజీ. సినిమా కథకు రివ్యూ ఉన్నట్లే.. ఆ బొమ్మ పనితనానికి ఓ రివ్యూ ఇచ్చేశాడు. అందుకోసం ఓ యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు పుట్టడొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి యూట్యూబ్‌ చానెళ్లు.. ఏవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ, మనోడు మాత్రం.. ఐదేళ్లుగా టాప్‌ యూట్యూబర్‌గా […]

Update: 2020-07-25 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చిన్నారులకు బొమ్మలతో ఆడుకోవడమంటే.. మహా సరదా. ర్యాన్ కాజీ అనే బుడ్డోడికి కూడా బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే, అందరి పిల్లల్లా ఆడుకోవడంతోనే వాటిని విడిచిపెట్టలేదు కాజీ. సినిమా కథకు రివ్యూ ఉన్నట్లే.. ఆ బొమ్మ పనితనానికి ఓ రివ్యూ ఇచ్చేశాడు. అందుకోసం ఓ యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు పుట్టడొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి యూట్యూబ్‌ చానెళ్లు.. ఏవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ, మనోడు మాత్రం.. ఐదేళ్లుగా టాప్‌ యూట్యూబర్‌గా దూసుకుపోతుండటం విశేషం. ఇంతకీ ర్యాన్ యూట్యూబ్ ప్రారంభించినప్పుడు అతడి వయసెంతో తెలుసా? జస్ట్ మూడేళ్లు. 2015లో ‘ర్యాన్ వరల్డ్’గా మొదలైన అతని యూట్యూబ్ చానెల్ ప్రస్థానం.. మూడు బొమ్మలు, ఆరు రివ్యూలుగా తయారైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక వ్యూయర్‌షిప్‌తో భారీ పారితోషికం తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.

అమెరికాకు చెందిన ర్యాన్.. మొదట తన చానెల్‌కు ‘ర్యాన్ టాయ్స్ రివ్యూ’గా పేరు పెట్టి, ఆ తర్వాత దానికి ‘ర్యాన్స్ వరల్డ్’గా పేరు మార్చాడు. 8 ఏళ్ల వయసున్న ర్యాన్ చానెల్‌కు ప్రస్తుతం 25.8 మిలియన్ల సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఇంగ్లీష్ చానెల్‌తో పాటు స్పానిష్, జపనీస్ చానెల్స్ కూడా రన్ చేస్తున్నాడు. పిల్లలకు బొమ్మల గురించి ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లేన్ చేయడం, కథలు చెప్పడం, సైన్స్ ప్రయోగాలు, పిల్లలు ఇష్టంగా తినే వంటకాలు, ఇలా అన్ని విషయాలను తన చానెల్ ద్వారా షేర్ చేస్తుంటాడు. కరోనా వైరస్‌పై పరిశోధనలు చేస్తున్న నిపుణులతోనూ తానే స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహించాడు.

నెంబర వన్
‘హయ్యెస్ట్ పెయిడ్ యూట్యూబర్ స్టార్స్’ 2019 ఫోర్బ్స్ జాబితాలో ర్యాన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. 2017, 2018లలో కూడా ఈ బుడ్డోడు 22 మిలియన్ డాలర్ల సంపాదనతో టాప్ పొజిషన్‌లో నిలిచాడు. 2019లో 26 మిలియన్ డాలర్లు సంపాదించాడు. టాయ్స్ రివ్యూ, అన్‌బాక్సింగ్‌తో మొదలైన ర్యాన్ యూట్యూబ్ చానెల్.. అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు అతి పెద్ద బ్రాండ్ చానెల్‌గా ఎదిగింది. ఎనిమిదేళ్ల ర్యాన్ బ్రాండ్ ప్రమోటర్‌గా మారిపోయాడు. అంతేకాదు ఇప్పుడు దాదాపు 80కి పైగా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. అందులో టూత్ ‌పేస్ట్, మండరిన్ ఆరెంజెస్, టెలివిజన్ షోస్, వీడియో గేమ్స్, క్లాతింగ్ ఐటెమ్స్, మ్యాగజైన్స్ ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ చిన్నోడి ఆదాయంలో 96 శాతం యాడ్స్ ద్వారానే వస్తుండగా.. మిగతా 4 శాతం స్పాన్సర్ పోస్ట్‌ల ద్వారా అందుతోంది.

యూట్యూబ్ చానెల్స్ :

ర్యాన్స్ వరల్డ్ : 25.8 మిలియన్ సబ్‌స్క్రైబర్స్
ర్యాన్స్ ఫ్యామిలీ రివ్యూ / : 5.9 మిలియన్ సబ్‌స్క్రైబర్స్
కాజీ ఫ్యామిలీ
ద స్టూడియో స్పేస్ : 1.91 మిలియన్ సబ్‌స్క్రైబర్స్
కాంబో పాండా : 1.45 మిలియన్ సబ్‌స్క్రైబర్స్
విట్యూబర్స్ : 1.41 మిలియన్ సబ్‌స్క్రైబర్స్
గస్ ద గమ్మీ గాటర్ : 1.02 మిలియన్ సబ్‌స్క్రైబర్స్
ఏక్ డూడుల్స్ : 446,000 సబ్‌స్క్రైబర్స్

మ్యాగజైన్స్ అండ్ బుక్స్ : ర్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్ , ర్యాన్స్ వరల్డ్ అమేజింగ్ స్టిక్కర్ సీన్స్, ర్యాన్స్ వరల్డ్ అల్టిమేట్ గైడ్

టెలివిజన్ : ర్యాన్స్ మిస్టరీ ప్లే డేట్ (Nick Jr.)

వీడియో గేమ్ : రేస్ విత్ ర్యాన్ (Outright Games)

ఫాస్ట్ ఫుడ్ టాయ్స్ : స్టార్ పాల్ కిడ్స్ మీల్ టాయ్స్ (Carl’s Jr)

ఫ్రూట్ : మాండరిన్ ఆరెంజెస్ (Wonderful Halos)

ఎక్కడైనా.. పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. చాలామంది నెట్ అంటేనే.. నెగటివ్ థాట్‌తో చూస్తారు. సో ఆ ఆలోచనలను పక్కన పెట్టి.. పిల్లల్లోని ప్రతిభను వెలికితీసే, సృజనాత్మకతను బహిర్గతపరిచే వేదికను ఎంచుకుంటూ ముందుకెళ్తే.. ఎక్కడైనా విజయం సాధించవచ్చు.

Tags:    

Similar News