అత్యధిక జీతం అందుకుంటున్న కెప్టెన్లు వీరే
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వేతనం అందుకుంటున్న కెప్టెన్‌గా జో రూట్ రికార్డు సృష్టించాడు. కేవలం టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రూట్‌కు ఈసీబీ ఏడాదికి రూ. 8.97 కోట్ల జీతం ఇస్తున్నది. మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు మాత్రం కేవలం రూ. 1.75 కోట్లు మాత్రమే అందుతుండటం గమనార్హం. ఇక భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ. 7 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నాడు. […]
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వేతనం అందుకుంటున్న కెప్టెన్‌గా జో రూట్ రికార్డు సృష్టించాడు. కేవలం టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రూట్‌కు ఈసీబీ ఏడాదికి రూ. 8.97 కోట్ల జీతం ఇస్తున్నది. మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు మాత్రం కేవలం రూ. 1.75 కోట్లు మాత్రమే అందుతుండటం గమనార్హం. ఇక భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ. 7 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఏ+ కేటగిరీ ఆటగాల్లకు అందరికీ ఇదే వేతనం అందుతుంది. ఇక ఆస్ట్రేలియా టెస్ట్, వైట్ బాల్ కెప్టెన్లు టిమ్ పైన్, ఆరోన్ ఫించ్ ఏడాదికి చెరి రూ. 5.63 లక్షల జీతం అందుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గార్ (రూ. 3.2 కోట్లు), పరిమిత ఓవర్ల కెప్టెన్ టెంబా బవుమా (రూ. 2.5 కోట్లు) జీతంగా అందుకుంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకున్న న్యూజీలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ రూ. 1.77 కోట్లు, వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ రూ. 1.73 కోట్లు, టెస్ట్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ రూ. 1.39 కోట్లు అందుకుంటున్నారు. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ రూ. 62.40 లక్షలు, శ్రీలంక టెస్ట్ కెప్టెన్ దిముత్ కరుణరత్నే రూ. 51.03 లక్షలు, కుశాల్ పెరీరా రూ. 25 లక్షలు అందుకుంటున్నారు.