కోమటిరెడ్డి కల నెరవేరేనా!
దిశ, నల్లగొండ: టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్‌గా తొలి నుంచి పార్టీలో ఉన్న వారినే నియమించాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కోరినట్టు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి 20 నిమిషాల పాటు చర్చలు జరపడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఢిల్లీ పర్యటనతో పీసీసీ చీఫ్‌గా కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరు నియమితులౌతురాని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విద్యార్థి దశ […]
దిశ, నల్లగొండ: టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్‌గా తొలి నుంచి పార్టీలో ఉన్న వారినే నియమించాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కోరినట్టు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి 20 నిమిషాల పాటు చర్చలు జరపడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఢిల్లీ పర్యటనతో పీసీసీ చీఫ్‌గా కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరు నియమితులౌతురాని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పని చేసిన తాను సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ జెండా మోశాననీ, చీఫ్‌గా సారథ్యం వహించాల్సి వస్తే పార్టీ బలోపేతానికి బలమైన చర్యలు తీసుకుంటానని వెంకట్‌రెడ్డి చెబుతున్నారు. అయితే, పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదనీ, కానీ ఆలస్యం చేయొద్దని వెంకట్‌రెడ్డి చెబుతుండటాన్ని పరిశీలిస్తే పార్టీ ఎదుగుదల కోసం ఆయన కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా..
కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ అధికార పార్టీ పైనే కాదు. సొంత పార్టీ నేతలపైనా విరుచుకుపడుతుంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట తమకు నచ్చినట్టు వ్యవహరిస్తుంటారని కొందరు కార్యకర్తలు ఆరోపిస్తుంటారు. ఈ బ్రదర్స్ కొంత కాలం నుంచి పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే బ్రదర్స్ ఇద్దరూ కేసీఆర్ సర్కార్‌ను ఇరుకున పెట్టే కార్యక్రమాలు తీసుకుంటున్నారనీ, సొంత పార్టీలోనూ విపక్ష నేతల వలే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పీసీసీ చీఫ్ పదవి గురించి తేల్చాలనీ లేకుండా సొంత పార్టీ పెడతానని రాజగోపాల్‌రెడ్డి అధిష్టానానికి చెప్పారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
‘ముందస్తు’లోఓడి..ఎంపీగా గెలిచి..
2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఐదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో రాజకీయంగా వెంకట్‌రెడ్డికి తొలిసారిఎదురుదెబ్బ తగిలింది. ఆ వెంటనే వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన భువనగిరి ఎంపీగా మెజార్టీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యత వహించాలనీ, ఆయన్ను నియమించి ఆరేళ్లు గడిచిందని, పైగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రాజీనామా చేస్తానని చెప్పారన్న విషయాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్తు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా వెంకట్‌రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కార్యాలయాలకు వెళ్తూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ చీఫ్‌గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమించిన నేపథ్యంలో పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగల శక్తి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి ఉన్నాయని కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని చీఫ్‌గా నియమిస్తుందో చూడాలి మరి..
Tags: tpcc chief, komatireddy venkatreddy, rajagopal reddy, telangana