డాట్ బాల్స్ ఆడింది ఎవరో తెలుసా?

దిశ, స్పోర్ట్స్ : యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభమై శనివారానికి రెండు వారాలు పూర్తయ్యింది. రెండు వారాల్లో జరిగిన అన్ని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. చాలా వరకు భారీ స్కోరింగ్ మ్యాచ్‌లే. ముఖ్యంగా పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఆర్సీబీకి చెందిన దేవ్‌దత్ పడిక్కల్ వంటి బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ప్రస్తుతం 239 పరుగులతో (శనివారం వరకు) కేఎల్ రాహుల్ టాప్ 2 బ్యాట్స్‌మాన్‌గా ఉన్నాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉన్నది. అయితే […]

Update: 2020-10-04 09:25 GMT

దిశ, స్పోర్ట్స్ : యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభమై శనివారానికి రెండు వారాలు పూర్తయ్యింది. రెండు వారాల్లో జరిగిన అన్ని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. చాలా వరకు భారీ స్కోరింగ్ మ్యాచ్‌లే. ముఖ్యంగా పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఆర్సీబీకి చెందిన దేవ్‌దత్ పడిక్కల్ వంటి బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ప్రస్తుతం 239 పరుగులతో (శనివారం వరకు) కేఎల్ రాహుల్ టాప్ 2 బ్యాట్స్‌మాన్‌గా ఉన్నాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉన్నది. అయితే ఈ సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ఆటగాడు కూడా కేఎల్ రాహులే కావడం గమనార్హం. కేఎల్ రాహుల్ 47 డాట్ బాల్స్ ఆడాడు. ఆ తర్వాతి స్థానాల్లో శుభమన్ గిల్ (45), ఆరోన్ ఫించ్/రోహిత్ శర్మ (44), మయాంక్ అగర్వాల్ (43) ఉన్నారు. మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్.

Tags:    

Similar News