మందుబాబులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్
వాషింగ్టన్: కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో మద్యం దుకాణాలు పూర్తిగా మూసేశారు. మనదేశంలో మద్యం అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించింది. కానీ, ఇతర దేశాల్లో దేశాల్లో మద్యం అమ్మకాలపై పెద్దగా ఆంక్షలు లేవు. పైగా ప్రజలందరూ ఇండ్లకే పరిమితం అవుతుండటంతో మద్యం వినియోగం కూడా పెరిగింది. కాగా, మద్యం కారణంగా కరోనా మనుషులకు మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం అవుతుందని.. దీంతో […]
వాషింగ్టన్: కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో మద్యం దుకాణాలు పూర్తిగా మూసేశారు. మనదేశంలో మద్యం అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించింది. కానీ, ఇతర దేశాల్లో దేశాల్లో మద్యం అమ్మకాలపై పెద్దగా ఆంక్షలు లేవు. పైగా ప్రజలందరూ ఇండ్లకే పరిమితం అవుతుండటంతో మద్యం వినియోగం కూడా పెరిగింది. కాగా, మద్యం కారణంగా కరోనా మనుషులకు మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం అవుతుందని.. దీంతో కరోనా వైరస్‌తో పోరాడే శక్తిని మానవ శరీరం కోల్పోతుందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ విభాగం చెబుతోంది. ఆల్కహాన్ అతిగా వినియోగించే వారికి మానసిక సమస్యలు ఉండటమే కాకుండా.. దాని ద్వారా ఇతర వ్యాదులు కూడా సంక్రమిస్తుంటాయి. కాబట్టి అదే సమయంలో వైరస్ సోకితే అన్ని వ్యాదులతో శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పోరాడలేదని చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఆల్కహాల్ తాగడం వల్ల కరోనా నాశనం అవుతుందని వస్తున్న వార్తలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ దీనికి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్ కూడా రూపొందించింది. మద్యం వల్ల కరోనా మరింత ప్రాణాంతకరంగా మారుతుందని చెప్పింది. అమెరికాలో గత నెలలో మద్యం అమ్మకాలు 22 శాతం పెరిగాయని నీల్సన్ సర్వే తెలియజేసింది. ఎక్కువ మంది అమెరికన్లు ఇంట్లోనే మద్యం సేవిస్తున్నారని.. వీరు ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లేనని పేర్కొంది.
TAGS: WHO, alcohol consumers, liquor, immune system, human