వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్.. హిట్టా? ఫట్టా?
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ పే, భారతదేశంలో పోయిన నెల ఎంట్రీ ఇచ్చింది. అయితే వాట్సాప్ అనగానే చాటింగ్, మెసేజ్‌లు అనుకుంటున్నారు. కానీ, నగదు చెల్లింపులు కూడా చేసుకోవచ్చని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. దీని వల్ల భారతదేశంలో 400 మిలియన్‌ల మంది యాక్టివ్ యూజనర్‌లు ఉన్నప్పటికీ నవంబర్ నెలలో కేవలం రూ.3,10,000 చెల్లింపులు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే పేమెంట్ గేట్‌వేగా వాట్సాప్ ఫెయిలైందా? అంటే అలాంటిదేమీ ఉండదని […]
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ పే, భారతదేశంలో పోయిన నెల ఎంట్రీ ఇచ్చింది. అయితే వాట్సాప్ అనగానే చాటింగ్, మెసేజ్‌లు అనుకుంటున్నారు. కానీ, నగదు చెల్లింపులు కూడా చేసుకోవచ్చని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. దీని వల్ల భారతదేశంలో 400 మిలియన్‌ల మంది యాక్టివ్ యూజనర్‌లు ఉన్నప్పటికీ నవంబర్ నెలలో కేవలం రూ.3,10,000 చెల్లింపులు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే పేమెంట్ గేట్‌వేగా వాట్సాప్ ఫెయిలైందా? అంటే అలాంటిదేమీ ఉండదని విశ్లేషకులు అంటున్నారు. ఇన్నాళ్లు చాటింగ్ కోసం ఉపయోగించిన వాట్సాప్‌ను ఒక్కసారిగా పేమెంట్‌ల ఆప్షన్ కోసం ఉపయోగించడం జనాలకు ఇంకా అలవాటు కాలేదని వారు చెబుతున్నారు.
అంతేగాకుండా ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి నగదు చెల్లింపుల యాప్‌లు ప్రతి ఒక్కరికీ చేరువ కావడం, ఆఫర్‌లు, కాంటెస్ట్‌లు నిర్వహిస్తూ ఎప్పుడూ యూజర్‌లతో మమేకమై ఉండటం వల్ల వాటి స్థానంలో మరో పేమెంట్ యాప్‌ను ఉపయోగించడానికి యూజర్‌లు ఇంకా అలవాటు పడలేదు. నవంబర్ నెలలో గూగుల్ పే ద్వారా 960 మిలియన్ చెల్లింపులు, ఫోన్‌పే ద్వారా 868 మిలియన్ చెల్లింపులు జరిగాయి. వాట్సాప్‌పే ద్వారా జరిగిన చెల్లింపులు వీటి దరిదాపుల్లో కూడా లేవు. కానీ, ప్రస్తుతానికి వాట్సాప్ ద్వారా రీసెల్లింగ్ బిజినెస్, చీరల బిజినెస్ చేస్తున్న వాళ్లందరూ వాట్సాప్‌పేను ఉపయోగిస్తున్నారని త్వరలోనే వాట్సాప్‌పే పెద్దమొత్తంలో వాడకానికి వచ్చి, ఏకఛత్రాధిపత్యం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.