వాట్సాప్‌లో పర్మినెంట్ మ్యూట్ ఆప్షన్ ?

దిశ, వెబ్‌డెస్క్ : వాట్సాప్‌ వాడకంపై యూజర్లు సానుకూలంగానే స్పందిస్తుంటారు. కానీ, ఈ గ్రూపుల గోలనే తట్టుకోలేకపోతున్నామని.. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మెసేజ్‌ల మోత మోగుతూనే ఉంటాయని కొంచెం చిరాకుపడుతుంటారు. పోనీ ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవుదామంటే.. ఫీలవుతారేమోనని మరో ఆలోచన. మరి నోటిఫికేషన్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు మ్యూట్ చేద్దామంటే.. ఆప్షన్ ఒక సంవత్సరం వరకే ఉంటుంది. మ్యూట్ చేయడానికి ఇదే హయ్యెస్ట్ టైమ్ పీరియడ్. అయితే ఇకపై అలా ఉండదు. […]

Update: 2020-07-30 00:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
వాట్సాప్‌ వాడకంపై యూజర్లు సానుకూలంగానే స్పందిస్తుంటారు. కానీ, ఈ గ్రూపుల గోలనే తట్టుకోలేకపోతున్నామని.. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మెసేజ్‌ల మోత మోగుతూనే ఉంటాయని కొంచెం చిరాకుపడుతుంటారు. పోనీ ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవుదామంటే.. ఫీలవుతారేమోనని మరో ఆలోచన. మరి నోటిఫికేషన్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు మ్యూట్ చేద్దామంటే.. ఆప్షన్ ఒక సంవత్సరం వరకే ఉంటుంది. మ్యూట్ చేయడానికి ఇదే హయ్యెస్ట్ టైమ్ పీరియడ్. అయితే ఇకపై అలా ఉండదు. వాట్సాప్ తన యూజర్లకు త్వరలోనే నోటిఫికేషన్ల గోల తప్పించేందుకు న్యూ ఫీచర్‌ను తీసుకురాబోతుంది.

సాధారణంగా చాలామంది వాట్సాప్ గ్రూపు లేదా వ్యక్తిగత చాట్ నోటిఫికేషన్లతో విసిగిపోతుంటారు. సమయం, సందర్భం లేకుండా వచ్చే ఈ నోటిఫికేషన్లకు చెక్ పెట్టేయందుకు మ్యూట్ ఆప్షన్ ఎంచుకుంటాం. అయితే ఈ ఫీచర్‌లో 8 గంటలు, వారం, ఏడాది పాటు మాత్రమే మ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే.. ఈ లిమిటెడ్ పీరియడ్‌కు బదులు పర్మినెంట్‌గా మ్యూట్ చేసే ఫీచర్‌పై వాట్సాప్ టీమ్ వర్క్ చేస్తున్నట్లు.. వాబేటాఇన్ఫో (wabetainfo) తెలిపింది. లేటెస్ట్ బీటాలో కూడా ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రాలేదు కానీ, రాబోయే వాట్సాప్ అప్‌డేట్‌లో ఈ ఫీచర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూట్ విధానంలో వన్ ఇయర్ ఉన్న ప్లేస్‌లో ఆల్వేస్ (Always) ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింట్లోనూ ఈ అప్షన్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News