మూడు రాష్ట్రాల అధికారులతో వాట్సాప్ గ్రూపు..

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నదీ పరివాహక అటవీ ప్రాంతాల్లో ఇకపైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అటవీ, పోలీసు అధికారుల జాయింట్ ఆపరేషన్లు కొనసాగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని పలు విభాగాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరింత పకడ్బందీగా రూపొందనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతర నిఘా కొనసాగనుంది. అడవుల పరిరక్షణ, స్మగ్లింగ్ నివారణ, అడవుల్లోకి అక్రమ చొరబాట్లను నిరోధించడం, వన్యప్రాణుల ఆవాసాలను అభివృద్ధి చేయడం తదితర పలు అంశాలపై మూడు రాష్ట్రాల ఉన్నతాధికారులు […]

Update: 2020-10-29 10:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నదీ పరివాహక అటవీ ప్రాంతాల్లో ఇకపైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అటవీ, పోలీసు అధికారుల జాయింట్ ఆపరేషన్లు కొనసాగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని పలు విభాగాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరింత పకడ్బందీగా రూపొందనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతర నిఘా కొనసాగనుంది. అడవుల పరిరక్షణ, స్మగ్లింగ్ నివారణ, అడవుల్లోకి అక్రమ చొరబాట్లను నిరోధించడం, వన్యప్రాణుల ఆవాసాలను అభివృద్ధి చేయడం తదితర పలు అంశాలపై మూడు రాష్ట్రాల ఉన్నతాధికారులు గురువారం భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరులో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మూడు రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం కోసం అధికారుల స్థాయిలో వాట్సాప్ గ్రూపును కూడా ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుని వ్యూహాత్మకంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఆర్. శోభ దీనిపై అధికారి ప్రకటనను విడుదల చేశారు. గోదావరి నది వెంట మూడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న అడవులను కాపాడడం, కలప స్మగ్లింగ్‌ను నివారించడం, వన్యప్రాణులను పరిరక్షించడం తదితర అంశాల్లో లోతుగా చర్చించినట్లు తెలిపారు.

Tags:    

Similar News