10 జట్లతో ఐపీఎల్.. వచ్చే సీజన్ మొత్తం ఎన్ని మ్యాచులో తెలుసా..?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 జట్లతో లీగ్ నిర్వహించబోతున్నారు. బీసీసీఐ కొత్త జట్లకు ఆహ్వానించిన టెండర్లలో లక్నో, అహ్మదాబాద్ కేంద్రాలుగా రెండు ఫ్రాంచైజీలు వచ్చి చేరాయి. ప్రస్తుతం 8 జట్లతో నిర్వహిస్తున్న లీగ్‌లో 60 మ్యాచ్‌లు ఉంటున్నాయి. ఇదే ఫార్మాట్‌లో 10 జట్లతో లీగ్ నిర్వహిస్తే.. మ్యాచ్‌ల సంఖ్య 90 దాటిపోనున్నది. అంత సుదీర్ఘంగా లీగ్ నిర్వహించడం కష్టంగా మారుతుంది. అందుకే 2011లో ఐపీఎల్ ఫార్మాట్‌ను తిరిగి 2022 నుంచి ఉపయోగించబోతున్నారు. ఈ ఫార్మాట్ […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 జట్లతో లీగ్ నిర్వహించబోతున్నారు. బీసీసీఐ కొత్త జట్లకు ఆహ్వానించిన టెండర్లలో లక్నో, అహ్మదాబాద్ కేంద్రాలుగా రెండు ఫ్రాంచైజీలు వచ్చి చేరాయి. ప్రస్తుతం 8 జట్లతో నిర్వహిస్తున్న లీగ్‌లో 60 మ్యాచ్‌లు ఉంటున్నాయి. ఇదే ఫార్మాట్‌లో 10 జట్లతో లీగ్ నిర్వహిస్తే.. మ్యాచ్‌ల సంఖ్య 90 దాటిపోనున్నది. అంత సుదీర్ఘంగా లీగ్ నిర్వహించడం కష్టంగా మారుతుంది. అందుకే 2011లో ఐపీఎల్ ఫార్మాట్‌ను తిరిగి 2022 నుంచి ఉపయోగించబోతున్నారు. ఈ ఫార్మాట్ ప్రకారం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతీ గ్రూప్‌లోని జట్లు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. అలాగే వేరే గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కోసారి, ఒక జట్టుతో రెండు సార్లు తలపడుతుంది. ఇతర గ్రూప్‌లోని ఏ జట్టుతో రెండు సార్లు ఆడాలనే దానికి డ్రా ద్వారా తేలుస్తారు.
ఇలా ఒక్కో జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే లీగ్‌లో రెండు గ్రూప్‌లు ఉన్నా.. పాయింట్ల పట్టిక మాత్రం ఒకటే ఉంటుంది. లీగ్ దశ పూర్తయ్యే సరికి టాప్ 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి పాత ఫార్మాట్‌లోనే క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్ నిర్వహిస్తారు. ఈ ఫార్మాట్ వల్ల మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. అంటే ప్రస్తుతం నిర్వహిస్తున్న 60 మ్యాచ్‌ల కంటే 14 మ్యాచ్‌లు అదనంగా ఉంటాయి. దీని వల్ల లీగ్ మరో వారం రోజులు మాత్రమే పొడిగిస్తే సరిపోతుంది. లేదంటే డబుల్ హెడర్ మ్యాచ్‌లు అదనంగా నిర్వహించడం వల్ల తక్కువ సమయంలోనే లీగ్ ముగించేయవచ్చు. బీసీసీఐ ఈ ఫార్మాట్‌లోనే లీగ్ నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు బోర్డు అధికారి చెప్పారు.