పెట్ డాగ్స్‌ను ప్రభుత్వానికి ఇవ్వాలంటున్న ‘కిమ్’
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువుల్లో ‘శునకం’ కూడా ఒకటి. చాలామంది కుక్కలను తమ ఇంట్లోని సభ్యులుగా ట్రీట్ చేస్తుంటారు. మనదేశంలో కోళ్లను, మేకలను మాంసం కోసం వినియోగించుకున్నట్లే.. చైనా, ఉత్తరకొరియా దేశాల్లో కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటుంటారు. అలా అని కుక్కలంటే ప్రేమ లేదని కాదు. ఉత్తరకొరియా వాసులు కూడా శునకాల్ని ప్రేమగా పెంచుకుంటారు. కానీ, ఇప్పుడు మాత్రం అక్కడ శునకాల్ని పెంచుకునే వారంతా ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ను తెగ తిట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువుల్లో ‘శునకం’ కూడా ఒకటి. చాలామంది కుక్కలను తమ ఇంట్లోని సభ్యులుగా ట్రీట్ చేస్తుంటారు. మనదేశంలో కోళ్లను, మేకలను మాంసం కోసం వినియోగించుకున్నట్లే.. చైనా, ఉత్తరకొరియా దేశాల్లో కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటుంటారు. అలా అని కుక్కలంటే ప్రేమ లేదని కాదు. ఉత్తరకొరియా వాసులు కూడా శునకాల్ని ప్రేమగా పెంచుకుంటారు. కానీ, ఇప్పుడు మాత్రం అక్కడ శునకాల్ని పెంచుకునే వారంతా ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ను తెగ తిట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా?
కరోనా కారణంగా ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడింది. దీంతో అక్కడి రెస్టారెంట్లకు, హోటళ్లకు మాంసం సరఫరా తగ్గిపోయింది. కాగా, శునకాల్ని ఎక్కువగా తినే ఉత్తర కొరియా వాసుల కోసం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ఓ పరిష్కారం చూపాలనుకున్నాడు. అందుకు.. దేశ అవసరాల కోసం ప్రజలు పెంచుకుంటున్న కుక్కలను గవర్నమెంట్‌కు అప్పగించాలంటూ ఓ ఆదేశాన్ని జారీ చేశాడు. జనం ప్రేమతో పెంచుకునే కుక్కలను చంపేసి రెస్టారెంట్లకు సప్లయ్ చేయాలనుకుంటోంది ప్రభుత్వం. ఈ పెంపుడు కుక్కల వివరాలు సేకరించి, వాటిని తీసుకురావడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించాడట కిమ్. ఇక ఎవరి ఇంట్లో కుక్క ఉన్నా.. ఆ అధికారులు వస్తే ఇచ్చేయాల్సిందే. లేకుంటే, అసలే కిమ్.. కుక్క సంగతి పక్కనబెడితే, ఇవ్వనన్న యజమానులను ఏం చేస్తాడో? అందుకే వాళ్లంతా.. కిమ్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ప్రేమగా పెంచుకున్న కుక్కలను ఇవ్వలేక సతమతమవుతున్నారు. అంతేకాదు, ఎవరూ కుక్కలను పెంచుకోవడానికి వీల్లేదని గత నెలలోనే ఓ ఆర్డర్ కూడా ఇచ్చాడు కిమ్. ఇప్పుడేమో పెట్ డాగ్స్‌ను చంపేయడానికి సిద్ధపడ్డాడు. కిమ్ పాలన అంటే అంతే మరి. ఆయన మాటే శాసనం.