పల్లాకు మొత్తం ఎంత మెజార్టీ అంటే?
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పట్టభద్రులు పట్టం కట్టారు. నాలుగు రోజుల పాటు ఉత్కంఠభరితంగా జరిగిన ఓట్ల లెక్కింపులో చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లానే విజయం సాధించారు. . తుది రౌండ్ కౌంటింగ్ అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డికి 49,362 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. తుది ఫలితం ఎలా ఉంది? నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5,05,565 ఓట్లు ఉండగా.. […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పట్టభద్రులు పట్టం కట్టారు. నాలుగు రోజుల పాటు ఉత్కంఠభరితంగా జరిగిన ఓట్ల లెక్కింపులో చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లానే విజయం సాధించారు. . తుది రౌండ్ కౌంటింగ్ అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డికి 49,362 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
తుది ఫలితం ఎలా ఉంది?
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5,05,565 ఓట్లు ఉండగా.. 3,87,969 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటు కాగా.. 21,636 ఓట్లు చెల్లలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో తీన్మార్ మల్లన్న కంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ గెలుపు కోటాకు 1,83,168 ఓట్లు అవసరం. అయితే ఏ అభ్యర్థికి మెజార్టీ లేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ పల్లా, తీన్మార్ మల్లన్నకు మధ్య పోరు తుది వరకు హోరాహోరీగా సాగింది. ఇక చివరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రొఫెసర్ కోదండరామ్ ఎలిమినేషన్ రౌండ్ ముగిసేసరికి పల్లాకు 1,61,811 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి. దీంతో అంతిమంగా రాజేశ్వర్ రెడ్డిని విజయం వరించింది.
కానీ గెలుపు కోటాకు కావాల్సిన 1,83,168 ఓట్లు రాకపోవడంతో.. రెండో స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్న ఎలిమినేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 36,556 ఓట్లు వచ్చాయి. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు కలుపుకుని పల్లా రాజేశ్వర్ రెడ్డి 49,362 ఓట్ల ఆధిక్యంతో గెలుపు జెండా ఎగురవేశారు. తుది ఫలితం(71వ రౌండ్) అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,98,367 ఓట్లు వచ్చాయి. ఇందులో పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840 ఉండగా.. రెండో ప్రాధాన్యత ఓట్లు 87,527గా ఉన్నాయి. అనంతరం పల్లా గెలచినట్లు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. ఆయనకు ఎన్నికైన పత్రాన్ని అందజేశారు.