కరోనా వేళ.. ఇమ్యూనిటీ బూస్టర్లకు డిమాండ్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వల్ల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాల వాడకం బాగా పెరిగింది. అంతేకాదు, ఓ వైపు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. జనాలు ఒకేసారి ఎక్కువ మొత్తంలో సరుకులు కొని తెచ్చుకుంటున్నారు. ఇంటి నుంచే పని చేయడం వల్ల ఓటీటీలకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇంకా ఈ పాండమిక్ టైమ్‌లో ఇండియన్స్ ఎక్కువగా దేనిపై స్పెండ్ చేశారో తెలుసా? ఇమ్యూనిటీ బూస్టర్స్.. ఇమ్యూనిటీని పెంచే ఆయుర్వేద మందుల వాడకం […]

Update: 2020-08-08 04:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వల్ల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాల వాడకం బాగా పెరిగింది. అంతేకాదు, ఓ వైపు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. జనాలు ఒకేసారి ఎక్కువ మొత్తంలో సరుకులు కొని తెచ్చుకుంటున్నారు. ఇంటి నుంచే పని చేయడం వల్ల ఓటీటీలకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇంకా ఈ పాండమిక్ టైమ్‌లో ఇండియన్స్ ఎక్కువగా దేనిపై స్పెండ్ చేశారో తెలుసా?

ఇమ్యూనిటీ బూస్టర్స్..

ఇమ్యూనిటీని పెంచే ఆయుర్వేద మందుల వాడకం బాగా పెరిగింది. డాబర్ ఇండియా లిమిటెడ్, హిమాలయ డ్రగ్ కంపెనీల ఉత్పత్తులైన చ్యవన్‌ప్రాష్, సెప్టిలిన్ ఉత్పత్తులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. చ్యవన్‌ప్రాశ్ అమ్మకాలు 283%, తేనె అమ్మకాలు 39% పెరిగాయని నీల్సన్ హోల్డింగ్స్ పీఎల్‌సీ వెల్లడించింది. భారతదేశపు అతిపెద్ద ఆయుర్వేద ఉత్పత్తుల సరఫరాదారులైన డాబర్, చ్యవన్‌ప్రాష్ అమ్మకాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 700% పెరిగినట్లు తెలిపారు. ఇక ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల విషయానికొస్తే.. ‘మాగీ, కిట్‌కాట్, మంచ్’ ఎక్కువగా కొనుగోలు చేశారు. పార్లే-జీ బిస్కెట్లు ఏప్రిల్-మే నెలల్లో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి.

డిజిటల్ సేవలు..

భారతీయులు ఎంటర్‌టైన్మెంట్ కోసం కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను ఉపయోగిస్తున్నారు.. కొత్త విద్యార్థుల సంఖ్య ఏప్రిల్, జూన్ మధ్య మూడు రెట్లు పెరిగింది. ఈ కామర్స్ సైట్స్‌లో ఎక్కువగా ల్యాప్‌టాప్‌ల కోసం సెర్చ్ చేస్తున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్..

జీ5, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు రోజువారీ యాక్టివ్ యూజర్లలో 33శాతం పెరగగా, యాప్ డౌన్‌లోడ్స్ 45శాతం పెరిగాయి. ఇక ఇటీవలే మరణించిన రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ల సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపినట్టు వెల్లడైంది.

హోమ్ నీడ్స్..

ఫ్లిప్‌కార్ట్ లెక్కల ప్రకారం.. జ్యూసర్స్, మిక్సర్లు, మైక్రోవేవ్ అమ్మకాలు జూలైలో నాలుగు రెట్లు పెరిగాయి. వాక్యూమ్ క్లీనర్లకు కూడా డిమాండ్ బాగా పెరిగింది.

Tags:    

Similar News