కరోనా సోకని దేశాలు ఏవో తెలుసా?
దిశ వెబ్ డెస్క్: కరోనా ప్రపంచాన్ని చుట్టి వేసింది. అగ్రదేశాలను వణికిస్తుంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ దేశాల్లో కరోనా కాటుకు వేలాదిమంది బలవుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. దాదాపు 48వేల మంది మరణించారు. అయితే కరోనా మహామ్మారి మాత్రం తొమ్మిది దేశాలను మాత్రం ఇంకా చేరలేదు. అందులో కొన్ని ఐలాండ్‌లు కూడా ఉన్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడిపోతోందన్నది కాదనలేని వాస్తవం. లక్షలాది ప్రాణాలు కరోనా వల్ల పోతున్నాయన్నది కూడా అక్షర […]
దిశ వెబ్ డెస్క్: కరోనా ప్రపంచాన్ని చుట్టి వేసింది. అగ్రదేశాలను వణికిస్తుంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ దేశాల్లో కరోనా కాటుకు వేలాదిమంది బలవుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. దాదాపు 48వేల మంది మరణించారు. అయితే కరోనా మహామ్మారి మాత్రం తొమ్మిది దేశాలను మాత్రం ఇంకా చేరలేదు. అందులో కొన్ని ఐలాండ్‌లు కూడా ఉన్నాయి.
కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడిపోతోందన్నది కాదనలేని వాస్తవం. లక్షలాది ప్రాణాలు కరోనా వల్ల పోతున్నాయన్నది కూడా అక్షర సత్యం అయితే. కొన్ని దేశాల్లో కరోనో కాలు పెట్టలేదంటే నమ్ముతారా? అవును ఇది నిజ. మార్చి 30, 2020 నాటికి జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన గ్లోబల్ ట్రాకింగ్ ప్రకారం కరోనా వైరస్ సోకని తొమ్మిది దేశాలను గుర్తించింది
ద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్:
ఆ జాబితాలో బురుండీ దేశం కూడా ఉంది. తూర్పు ఆఫ్రికాలోని ఈ దేశం వన్యప్రాణులకు మరియు పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. దీనికి ఉత్తరసరిహద్దులో రువాండా, తూర్పు, దక్షిణ సరిహద్దులో టాంజానియా, పశ్చిమసరిహద్దులో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉన్నాయి. ఇది మద్య ఆఫ్రికాలో భాగంగా ఉంది. బరుండి రాజధాని ముజుంబురా. ఇప్పటికైతే.. ఈ దేశం వరకు వైరస్ వ్యాప్తి చెందలేదు.
తూర్పు ఆఫ్రికాలోని మరో దేశం మాలావి. ఈ దేశాన్నే గతంలో న్యాసాలాండు అని పిలిచేవారు. దీనికి వాయువ్యసరిహద్దులో జాంబియా, ఈశాన్యసరిహద్దులో టాంజానియా, తూర్పు, దక్షిణ, పశ్చిమ సరిహద్దులలో మొజాంబిక్ ఉన్నాయి.ఈ దేశం వన్యప్రాణులకు మరియు బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక్క కేసు నమోదు కాలేదు.
తూర్పు ఆఫ్రికాలోని కొమొరోస్ దేశాన్ని కూడా వైరస్ తాకలేదు. ఇక్కడ ద్వీప సమూహాలు ఎక్కువగా ఉంటాయి. కొమోరియన్ ద్వీప సమూహంలో సువాసన గల మొక్కలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని సుగంధ ద్వీపాలు అని పిలుస్తారు. ఇక్కడ కూడా కరోనా కేసు నమోదు కాలేదు.
ఉత్తర ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్. గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన దేశాలలో ఇది కూడా ఒకటి. సూడాన్ వరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదు.
దక్షిణ ఆఫ్రికాలోని లెసోతో. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ కమ్యూనిటీ సభ్యదేశంగా ఉంది. లెసోతో అనే పేరుకు “సెసోతో మాట్లాడే ప్రజల భూమి” అని అర్ధం.[
తుర్క్మెనిస్తాన్, తజకిస్తాన్:
మధ్య ఆసియాలోని తుర్క్ మెనిస్తాన్ పురావస్తు శిధిలాలకు పేరుగాంచింది. సహజ వాయువు నిల్వలలో ఇది ప్రపంచంలోనే 4వ దేశం. ఇక్కడ కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదుకాలేదు…
మధ్య ఆసియాలోని మరో దేశం తజికిస్తాన్. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి మొదటి వారంలో 35 దేశాల పౌరుల ప్రవేశాన్ని నిషేధించింది. 2019 లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9.32 మిలియన్లు.
యెమెన్:
మిడిల్ ఈస్ట్ లోని మరో దేశం యెమెన్. అరబ్ ల చేత పాలించబడుతున్న రెండో అతిపెద్ద సార్వభౌమ రాజ్యం. ఇక్కడికి కూడా వైరస్ చేరుకోలేదు.
నౌరు దేశాన్ని కూడా వైరస్ ముట్టుకోలేదు. 52 సంవత్సరాల క్రితం నౌరు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
సమోవా, తువాలు, వనుయేతు లలో కూడా కరోనా వైరస్ అడుగుపెట్టలేదని సమాచారం.
Tags : corona, countries, not affected, world, africa, asia