ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే?

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఇళ్లల్లో, కార్యాలయాల్లో కూలర్లు, ఏసీలు వాడకం పెరగడం సహజమే. అయితే ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఇంట్లో విండో ఏసీలు వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, సెంట్రల్ ఏసీలతోనే కాస్త ముప్పు పొంచి ఉందని అందరికీ తెలిసిందే. అయితే.. ఇంట్లోనే కాకుండా, ఆఫీసుల్లో, ఆస్పత్రుల్లో ఉపయోగించే ఏసీ ఉష్ణోగ్రతలపై కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేంటింగ్ […]

Update: 2020-04-25 06:17 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఇళ్లల్లో, కార్యాలయాల్లో కూలర్లు, ఏసీలు వాడకం పెరగడం సహజమే. అయితే ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఇంట్లో విండో ఏసీలు వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, సెంట్రల్ ఏసీలతోనే కాస్త ముప్పు పొంచి ఉందని అందరికీ తెలిసిందే. అయితే.. ఇంట్లోనే కాకుండా, ఆఫీసుల్లో, ఆస్పత్రుల్లో ఉపయోగించే ఏసీ ఉష్ణోగ్రతలపై కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేంటింగ్ అండ్ కండిషనర్ ఇంజనీర్స్ (ishare)సూచించిన ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఇళ్లలో ఏసీలు వాడేటప్పుడు 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. తేమ స్థాయి 40 నుంచి 70 శాతం వరకు ఉండాలి. గదిలోకి గాలులు, వెంటిలేషన్ వచ్చే కిటీకీలు, ఇతర ప్రదేశాల్లోనే కూలర్లను ఏర్పాటు చేసుకోవాలి. కూలర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. వాటిలోని నీళ్లను కూడా మారుస్తూ ఉండాలి. బయటి గాలిని పీల్చుకోలేని పోర్టబుల్ కూలర్లు వాడకపోవడమే మంచిది. ఇంట్లోకి గాలి వచ్చే విధంగా కిటీకీలు కొద్దిగా తెరిచి ఉంచుకోవాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్‌లో ఉంచడమే మంచిది. కరోనా వైరస్ ముప్పును పరిమితం చేసేందుకు ఎప్పటికప్పుడు వెంటిలేషన్ చక్కగా ఉండేలా చూసుకోవడం మంచి పరిష్కారమని ఐఎస్‌హెచ్ఆర్ఏఈ సూచించింది. ఎక్కువ సమయం ఏసీల్లో గడపటం వల్ల.. ఫ్రెష్ ఎయిర్ అందక.. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి అవకాశం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటే చర్మం పొడిబారిపోతుంది. కళ్లు దురద పెట్టడం వంటి స‌మ‌స్య‌లు కూడా వస్తుంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ వాడాల్సి వచ్చినప్పటికీ వీలుచిక్కినప్పుడల్లా బయటి వాతావరణంలో గడపాలి. తలుపులు, కిటికీలు తెరచి సహజసిద్ధమైన గాలిని లోపలికి రానిస్తే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. సో.. ఏసీలు వాడుతున్న‌వారు కాస్త మితంగా వాడితే మంచిది. వాడకపోతే ఇంకా మంచిది.

tags :ac, refrigerator, fans, exhaust fans, free air, temperature, humidity, central govt, ishare

Tags:    

Similar News