అంతర్జాతీయ క్రికెట్‌కు శామ్యూల్స్‌ గుడ్‌బై

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో క్రికెటర్లు వరుసగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే టీమిండియా దిగ్గజం ఎమ్‌ఎస్ ధోనీ, సురేశ్ రైనా, ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ మార్లాన్ శ్యామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో ఇప్పటికే స్టార్ సీనియర్ క్రికెటర్లు దూరమవ్వడంతో ఇబ్బందులు పడుతున్న వెస్టిండీస్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇక నుంచి […]

Update: 2020-11-04 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో క్రికెటర్లు వరుసగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే టీమిండియా దిగ్గజం ఎమ్‌ఎస్ ధోనీ, సురేశ్ రైనా, ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ మార్లాన్ శ్యామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో ఇప్పటికే స్టార్ సీనియర్ క్రికెటర్లు దూరమవ్వడంతో ఇబ్బందులు పడుతున్న వెస్టిండీస్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇక నుంచి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు శ్యామ్యూల్స్ ప్రకటించాడు. 2018 డిసెంబర్‌ తర్వాత శామ్యూల్స్‌ మళ్లీ వెస్టిండీస్‌ తరపున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అంతేగాకుండా ఇక ఆడే అవకాశం కూడా రాదేమో అని శామ్యూల్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే 2000వ సంవత్సరంలో శ్యామ్యూల్స్ వెస్టిండీస్ జట్టులో అడుగుపెట్టాడు. నాటి నుంచి మొత్తం 71 టెస్ట్‌ మ్యాచ్‌లు, 207 వన్డేలు, 67 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 11,134 పరుగులు చేశాడు. 17 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అంతేగాకుండా ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా కూడా శ్యామ్యూల్స్ రాణించారు. 152 వికెట్లు కూడా తీసుకుని సత్తా చాటాడు. 2012,2106లలో వెస్టిండీస్‌ ఐసీసీ టీ-20 టైటిల్స్‌ను గెల్చుకుంది. ఈ రెండు విజయాలలో శామ్యూల్స్‌ ప్రధాన భూమికను పోషించాడు. అలాగే 2016 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో అజేయంగా 85 పరుగులు చేసి టీ20 ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న శ్యామ్యూల్స్ రిటైర్మెంట్ ప్రకటించడం వెస్టిండీస్ క్రీడాభిమానులకు చేదు వార్తే అని చెప్పాలి.

Tags:    

Similar News