బెంగాల్‌లో ‘గాయం’ రేపుతున్న రాజకీయం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి ఘటన అక్కడ రాజకీయంగా సెగ పుట్టిస్తున్నది. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దైవ దర్శనానికి వెళ్తున్న సందర్భంగా.. బుధవారం తనపై పలువురు దాడి చేశారని ఆరోపిస్తూ దీదీ కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీదీని పరీక్షించిన వైద్యులు ఆమె కాలికి కట్టువేసి.. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇక దీదీపై దాడి చేసిన విషయాన్ని టీఎంసీ, బీజేపీలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. ఒకపార్టీపై మరో పార్టీ […]
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి ఘటన అక్కడ రాజకీయంగా సెగ పుట్టిస్తున్నది. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దైవ దర్శనానికి వెళ్తున్న సందర్భంగా.. బుధవారం తనపై పలువురు దాడి చేశారని ఆరోపిస్తూ దీదీ కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీదీని పరీక్షించిన వైద్యులు ఆమె కాలికి కట్టువేసి.. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇక దీదీపై దాడి చేసిన విషయాన్ని టీఎంసీ, బీజేపీలు రాజకీయంగా వాడుకుంటున్నాయి.
ఒకపార్టీపై మరో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాయి. దీదీపై దాడి వెనుక కుట్ర దాగి ఉన్నదని.. ఆమెతో పాటు ఎన్నికల్లో పాల్గొనబోయే అభ్యర్థుల భద్రత ఈసీదేనని టీఎంసీ కోరింది. ఇక ఈ ఘటనలో వాస్తవాలు వెలికి తీయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఆమెపై జరిగిన దాడి పట్ల తృణమూల్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మమతను పరామర్శించడానికి ఆస్పత్రికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్, పలువురు బీజేపీ నాయకులు అక్కడ్నుంచి వెళ్లిపోవాలని (గో బ్యాక్) నినాదాలు చేశారు.
వీల్ చైర్ నుంచైనా ప్రచారం చేస్తా..
ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెనర్జీ అక్కడ్నుంచే కార్యకర్తలకు వీడియో సందేశం పంపారు. ఆమె మాట్లాడుతూ.. ‘నా కాలికి గాయమైంది. ఛాతి, చేతులు, కాళ్లలో నొప్పిగా ఉంది. ప్రస్తుతం నాకు వైద్యం జరుగుతుంది. రెండు, మూడు రోజుల్లో నేను తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాననే నమ్మకం ఉంది. నా ఎన్నికల ప్రచార షెడ్యూలులో ఎలాంటి మార్పూ లేదు. అవసరమైతే వీల్ చైర్ నుంచైనా ప్రచారం చేస్తా. ఇందుకు మీ అందరి సహకారం కావాలి. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సంయమనం పాటించాలి’ అని శ్రేణులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీఎంసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. కాగా ఆస్పత్రిలో ఉన్న దీదీని టీఎంసీ నాయకులు నుస్రత్ జహాన్, రూహీ, మిమి చక్రవర్తిలు పరామర్శించారు. బీజేపీ నాయకులు తథాగత్ రాయ్ బృందం కూడా ఆమెను పరామర్శించడానికి వెళ్లగా అందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు.
దాడి ఆరోపణలపై విమర్శలు
మమతా బెనర్జీపై దాడి జరిగిన మాట అవాస్తవమనీ, ఆ సమయంలో తన చుట్టూ పోలీసులు లేరనడం హాస్యాస్పదమని బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. దాడి జరిగిన సమయంలో అక్కడున్న వీడియో ఫుటేజీని తీసి విచారణ జరపాలని, దీనిని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విషయమై బీజేపీ కూడా గట్టిగానే స్పందించింది. దీదీకి జరిగిన దాడిపై ఆమె అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇదిలాఉండగా.. మమతపై దాడి జరగలేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెబుతుండటం గమనార్హం. కాగా.. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన టీఎంసీ నాయకులు నేడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు.