Trissur Police: పోలీస్ యూనిఫాంలో సైబర్ సెల్ అధికారికి అడ్డంగా దొరికిన స్కామర్

ముంబై పోలీసు అధికారి నంటూ మోసానికి ప్రయత్నించిన అతడికి త్రిసూర్ సిటీ నిజమైన పోలీసు అధికారి ఎదురుకావడంతో ఖంగు తిన్నాడు.

Update: 2024-11-15 18:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సైతం అంతే వేగంగా మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, తాజా ఓ సైబర్ నేరస్తుడు ఫోన్ కాల్ ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించి తానే స్వయంగా పోలీసులకు దొరికిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ముంబై పోలీసు అధికారి నంటూ మోసం చేసేందుకు ప్రయత్నించిన అతడికి త్రిసూర్ సిటీ నిజమైన పోలీసు అధికారి ఎదురుకావడంతో ఖంగు తిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై పోలీసు అధికారినంటూ స్కామర్ త్రిసూర్ సిటీ పోలీసు అధికారికి ఫోన్ చేశాడు. పోలీసు యూనిఫామ్ ధరించి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఎప్పటిలాగే, సాధరాణ బాధితుడిగా భావించి డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేశాడు. మొదట త్రిసూర్ పోలీసు అధికారి ఫోన్ కెమెరా ఆఫ్ చేసి వివాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే, స్కామర్ పదేపదే ఎక్కడ ఉన్నారు, కెమెరా ఆన్ చేయాలని పట్టుబట్టాడు. దాంతో త్రిసూర్ పోలీసు అధికారి కెమెరా ఆన్ చేసి.. ఇదంతా పక్కనపెట్టు బ్రదర్, మీ లొకేషన్ మాకు తెలిసిపోయిందని చెప్పడంతో స్కామర్ తెల్లమొహం వేశాడు. మీరు సైబర్ సెల్‌కు ఫోన్ చేశారని చెప్పడంతో స్కామర్ వెంటనే ఫోన్ కట్ చేశాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ అయింది. 

Tags:    

Similar News