Hamas : కాల్పుల విరమణకు రెడీ.. ట్రంప్ ఒత్తిడి చేయాలని హమాస్ రిక్వెస్ట్

ఇజ్రాయెల్‌తో గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు మిలిటెంట్ గ్రూప్ సంస్థ హమాస్ సీనియర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Update: 2024-11-15 18:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్‌తో గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు మిలిటెంట్ గ్రూప్ సంస్థ హమాస్ సీనియర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. పాలస్తీనా భూభాగంలో యూదు రాజ్యంపై ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను ముగించేలా ఒత్తిడి పెంచాలని ఇటీవల గెలిచిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌ను కోరాడు. తమ ప్రతిపాదనను ఇజ్రాయెల్ గౌరవిస్తే గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ పొలిటికల్ బ్యూరో మెంబర్ బసెమ్ నయీం ఖతార్ రాజధాని దోహాలో అన్నాడు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యూఎస్ పరిపాలన విభాగాన్ని, డోనాల్డ్ ట్రంప్‌ను కోరాడు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం యత్నిస్తున్న ఖతార్ తన మధ్యవర్తి బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తర్వాత హమాస్ ప్రతినిధి ఈ మేరకు ప్రకటన చేశాడు. ఖతార్ ప్రస్తుతం పాలస్తీనాకు చెందిన పలువురు పొలిటికల్ బ్యూరో సభ్యులకు నివాసం కల్పిస్తోంది. అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అంశంలో బలమైన సంకల్పం ఉంటేనే మధ్యవర్తి బాధ్యతలు కొనసాగించనున్నట్లు ఖతార్ విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మజిద్ అల్ అన్సారీ అన్నాడు. 

Tags:    

Similar News