డబ్ల్యూహెచ్ వోకు మేం రాంరాం : ట్రంప్
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రకటన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా డబ్ల్యూహెచ్ వోకు ఇచ్చే నిధులను కూడా ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్లించనున్నట్లు ట్రంప్ తెలిపారు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ వో సరిగ్గా వ్యవహరించలేదన్నారు. చైనాలో వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి వివరాలను డబ్ల్యూహెచ్ వో కప్పిపుచ్చిందంటూ మండిపడ్డారు. చైనా తప్పిదం వల్ల ప్రస్తుతం ప్రపంచం బాధపడుతుందని […]
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రకటన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా డబ్ల్యూహెచ్ వోకు ఇచ్చే నిధులను కూడా ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్లించనున్నట్లు ట్రంప్ తెలిపారు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ వో సరిగ్గా వ్యవహరించలేదన్నారు. చైనాలో వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి వివరాలను డబ్ల్యూహెచ్ వో కప్పిపుచ్చిందంటూ మండిపడ్డారు. చైనా తప్పిదం వల్ల ప్రస్తుతం ప్రపంచం బాధపడుతుందని ఆయన అన్నారు. ఈ కారణంగానే తాము డబ్ల్యూహెచ్ వో నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.