భక్తజన సంద్రమైన ఏడుపాయలు..

దిశ. పాపన్నపేట: అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా మాత సన్నిధిలో ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు దుర్గామాత ఒడి బియ్యం, కుంకుమార్చనలు, బోనాలు, సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో శ్రీనివాస్ సూచించారు. అప్పన పేట […]

Update: 2021-12-05 05:11 GMT

దిశ. పాపన్నపేట: అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా మాత సన్నిధిలో ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు దుర్గామాత ఒడి బియ్యం, కుంకుమార్చనలు, బోనాలు, సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో శ్రీనివాస్ సూచించారు. అప్పన పేట ఎస్ఐ సురేష్ ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News