ఒక్క కాల్‌తో ఆగిన పెళ్లి.. రాత్రంతా స్టేషన్‌లోనే వధూవరులు!

దిశ, వెబ్ డెస్క్ : ఒక్క కాల్ మరికొద్ది క్షణాల్లో జరగాల్సిన పెళ్లిని ఆగిపోయేలా చేసింది. సదరు కాల్ చేసిన వ్యక్తి చెప్పిన వార్త నిజమని భావించిన పోలీసులు పెళ్లికొడుకు, పెళ్లి కూతుర్ని రాత్రంతా స్టేషన్‌లో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. చివరికి తాము చేసింది తప్పని తెలుసుకుని వారిని విడిచిపెట్టారు. వివరాల్లోకివెళితే.. ఉత్తర్ ప్రదేశ్ కుషీనగర్ పీఎస్ పరిధిలో హైదర్ అలీ, షబీలాల పెళ్లి గురువారం జరగాల్సి ఉంది. అదే సమయంలో కుషీనగర్ పోలీసులకు ఓ […]

Update: 2020-12-10 21:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఒక్క కాల్ మరికొద్ది క్షణాల్లో జరగాల్సిన పెళ్లిని ఆగిపోయేలా చేసింది. సదరు కాల్ చేసిన వ్యక్తి చెప్పిన వార్త నిజమని భావించిన పోలీసులు పెళ్లికొడుకు, పెళ్లి కూతుర్ని రాత్రంతా స్టేషన్‌లో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. చివరికి తాము చేసింది తప్పని తెలుసుకుని వారిని విడిచిపెట్టారు.

వివరాల్లోకివెళితే.. ఉత్తర్ ప్రదేశ్ కుషీనగర్ పీఎస్ పరిధిలో హైదర్ అలీ, షబీలాల పెళ్లి గురువారం జరగాల్సి ఉంది. అదే సమయంలో కుషీనగర్ పోలీసులకు ఓ అగంతకుడు ఫోన్‌చేసి తాముండే ఏరియాలో మతమార్పిడి (లవ్ జిహదీ) పెళ్లి జరుగుతుందని ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాబోయే హైదర్ అలీ దంపతుల్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. లవ్ జిహదీకు పాల్పడుతున్నాడంటూ పోలీసులు బాధితుడిపై దాడి చేశాడు. అయితే, హైదర్ అలీ అరెస్ట్ పై అతని బంధువులు పోలీస్ ఉన్నతాధికారుల్ని ఆశ్రయించారు. హైదర్ అలీ నా చెల్లెలు భర్త. అమె అనారోగ్య కారణంగా రెండో పెళ్లి చేసుకుంటున్నాడని ..మొదటి భార్య సోదరుడు పలు ఆధారాల్ని పోలీసులకు అందించడంతో తాము చేసింది తప్పేనని పోలీసులు క్షమాపణలు చెప్పి ఆ దంపతుల్ని వదిలేశారు.

కాగా, పెళ్లి ఆగిపోవడానికి కారణమైన అగంతకుడి ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేసి పట్టుకున్నామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Tags:    

Similar News