నల్లగొండలో తుపాకులకు పూజలు.. శుభాకాంక్షలు తెలిపిన డీఐజీ

దిశ, నల్లగొండ: విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాల్లో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాల్లో అగ్రభాగంలో ఉండాలని డీఐజీ ఏవీ రంగనాథ్ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో డీఐజీ రంగనాథ్, ఆయన సతీమణి లావణ్యతో కలిసి ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని, అలాంటి విజయాలను చేకూర్చే […]

Update: 2021-10-14 09:43 GMT

దిశ, నల్లగొండ: విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాల్లో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాల్లో అగ్రభాగంలో ఉండాలని డీఐజీ ఏవీ రంగనాథ్ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో డీఐజీ రంగనాథ్, ఆయన సతీమణి లావణ్యతో కలిసి ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని, అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.

పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. అనంతరం ఎంటీ విభాగం వద్ద వాహనాల పూజ నిర్వహించి పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమాలల్లో ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, ఏఆర్ డీఎస్పీ సురేష్ కుమార్, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు నర్సింహా చారి, శ్రీనివాస్, సిబ్బంది జలీల్, లియాఖత్, లాజర్, ఖాసీం, డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News