ఏఐఎస్జీఈఎఫ్ బలోపేతానికి కృషి చేస్తాం

దిశ, తెలంగాణ బ్యూరో : అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ( ఏఐఎస్జీఈఎఫ్ ) ను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం నుంచి టీఎన్జీవోల తరపున కృషి చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆగస్టు 18,19 వ తేదీల్లో జరిగిన ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో మామిళ్ల రాజేందర్ ను సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా సమాఖ్య […]

Update: 2021-08-19 10:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ( ఏఐఎస్జీఈఎఫ్ ) ను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం నుంచి టీఎన్జీవోల తరపున కృషి చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆగస్టు 18,19 వ తేదీల్లో జరిగిన ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో మామిళ్ల రాజేందర్ ను సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యులుగా టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. ప్రతాప్ ను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 29 రాష్ట్రాలకు ఏఐఎస్జీఈఎఫ్ నాయకత్వం వహిస్తుందన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ నాయకులకు వైస్ ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ తరుపున టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, రాష్ట్ర కోశాధికారి రామినేని శ్రీనివాసరావు , అసోసియేట్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News