ఇదేం చెత్తా.. బండి వచ్చినంక కూడా ఇట్ల వేసుడేందీ?: హరీశ్ రావు
దిశ, మెదక్: ఇక నుంచి రోడ్లపై ఎవరైనా చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం సిద్ధిపేటలో పర్యటించిన ఆయన 6వ వార్డులో పాత పారుపల్లి పాఠశాల ప్రాంతంలో ఉన్న చెత్తను చూసి అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం చెత్త.. ప్రతి రోజూ చెత్త బండి వచ్చినంక కూడా ఇట్ల రోడ్లపై చెత్త వేయడం ఏంటి అని ప్రశ్నించారు. అదేవిధంగా ఎన్ సాన్ పల్లి రోడ్డులో కూడా ఇదే […]
దిశ, మెదక్: ఇక నుంచి రోడ్లపై ఎవరైనా చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం సిద్ధిపేటలో పర్యటించిన ఆయన 6వ వార్డులో పాత పారుపల్లి పాఠశాల ప్రాంతంలో ఉన్న చెత్తను చూసి అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం చెత్త.. ప్రతి రోజూ చెత్త బండి వచ్చినంక కూడా ఇట్ల రోడ్లపై చెత్త వేయడం ఏంటి అని ప్రశ్నించారు. అదేవిధంగా ఎన్ సాన్ పల్లి రోడ్డులో కూడా ఇదే పరిస్థితి కనపడగానే మంత్రి కారులో నుంచి దిగి.. అక్కడే ఉన్న షాప్ యజమానిని పిలిచి అడిగారు. అనంతరం ఇలా రోడ్లపై చెత్త వేసే వారిపై సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాలని పొలీస్ అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలా కనపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. సిద్ధిపేట పట్టణం పారిశుధ్యంలో.. పరిశుభ్రలో మరింత మార్పు రావాలని ఆ దిశగా ప్రజల్లో అవగాహన తేవాలన్నారు.