రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో సేవలు.. అదే నా లక్ష్యం : ఎంపీ కోమటిరెడ్డి
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టి భువనగిరి పార్లమెంట్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్‌స్టేషన్‌కు రాచకొండ సీపీ మోహన్ భగవత్‌తో కలిసి ఎంపీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని […]
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టి భువనగిరి పార్లమెంట్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్‌స్టేషన్‌కు రాచకొండ సీపీ మోహన్ భగవత్‌తో కలిసి ఎంపీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని రామోజీ ఫిల్మ్ సిటీవరకు పొడిగించడానికి కృషిచేస్తానన్నారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే వందల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. NH-9 విస్తరణ కోసం కేంద్రమంత్రులను కలిసి రూ. 600 కోట్లు మంజూరు చేయించిన ఘనత తమదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు మర్చిపోయారని, శంకుస్థాపనలు చేసి పనులు చేయడం మర్చిపోయారని దుయ్యబట్టారు. వారి తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో ప్రభుత్వ కార్యక్రమాలకు తమను పిలవడం లేదని మండిపడ్డారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన సర్కార్‌పై, అధికారులపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.