సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : వీహెచ్
నేరచరిత్ర ఉన్నవారు 48గంటల లోపు వివరాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రత్మకమైనదన్నారు. బిజినెస్ రాజకీయలకు చెక్ పెట్టడానికి ఇది మంచి మార్గమన్నారు. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తర్వాత సంపాదించుకోవడం రాజకీయం అయిందన్నారు. బ్యాంక్ మోసాలకు పాల్పడ్డ వారిని కూడా ఇందులో చేర్చాలన్నారు. నేర చరిత్ర ఉన్న వారే ముఖ్యమంత్రులు, […]
నేరచరిత్ర ఉన్నవారు 48గంటల లోపు వివరాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రత్మకమైనదన్నారు. బిజినెస్ రాజకీయలకు చెక్ పెట్టడానికి ఇది మంచి మార్గమన్నారు. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తర్వాత సంపాదించుకోవడం రాజకీయం అయిందన్నారు. బ్యాంక్ మోసాలకు పాల్పడ్డ వారిని కూడా ఇందులో చేర్చాలన్నారు. నేర చరిత్ర ఉన్న వారే ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతున్నారని విమర్శించారు. సుప్రీం రిజర్వేషన్లు హక్కు కాదనడం బాధాకరమన్నారు. మహనీయుల వర్థంతులను, జయంతులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రిజర్వేషన్లు ఎత్తేయడం ఎన్నార్సీ కంటే ప్రమాదకరమైదన్నారు.