కరోనా సమయంలోనూ ఆదుకున్నాం :కేసీఆర్

దిశ, వెబ్‎డెస్క్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని.. ఉద్యోగులు, పెన్షన్ల జీతాల్లోనూ కోతలు విధించి ప్రజలను ఆదుకున్నామని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 108 పథకం బాగుందనే.. దానిని కొనసాగిస్తున్నామని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో కలిపేందుకు పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో కరోనా వైరస్‎పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు […]

Update: 2020-09-09 05:22 GMT

దిశ, వెబ్‎డెస్క్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని.. ఉద్యోగులు, పెన్షన్ల జీతాల్లోనూ కోతలు విధించి ప్రజలను ఆదుకున్నామని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 108 పథకం బాగుందనే.. దానిని కొనసాగిస్తున్నామని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో కలిపేందుకు పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

అసెంబ్లీలో కరోనా వైరస్‎పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు అవసరమైన సేవలు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. తెలంగాణలో మాత్రమే వైన్ షాపులు తెరిచామా..? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెరవలేదా అంటూ ప్రశ్నించారు. కరోనా మరణాలు దాచేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కరోనా మరణాల సంఖ్య జాతీయ స్థాయిలో కంటే రాష్ట్రంలో తక్కువే ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

Tags:    

Similar News