మరణించిన పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటాం : ఇందిరా శోభన్
దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలోని పద్మావతి కాలనీ డ్రైనేజీ మ్యాన్ హోల్‌లో పడి మరణించిన పారిశుద్ధ్య కార్మికులు శివ, అంతయ్య కుటుంబాల్లో ఇంటికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. వనస్థలిపురం సాహెబ్ నగర్‌లో మంగళవారం బాధిత కుటుంబీకులను ఆమె పరామర్శించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎలాంటి హామీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలోని పద్మావతి కాలనీ డ్రైనేజీ మ్యాన్ హోల్‌లో పడి మరణించిన పారిశుద్ధ్య కార్మికులు శివ, అంతయ్య కుటుంబాల్లో ఇంటికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. వనస్థలిపురం సాహెబ్ నగర్‌లో మంగళవారం బాధిత కుటుంబీకులను ఆమె పరామర్శించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోవడంపై ఆమె మండిపడ్డారు. బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలన్నారు. కాగా వారికి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చర్య తీసుకుంటామని ఏసీపీ పురుషోత్తంరెడ్డి సర్ది చెప్పగా లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు ధర్నాను కొనసాగించారు. అనంతరం అక్కడికి చేరుకున్న హయత్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. ఈ ధర్నాలో బాధిత కుటుంబీకులు, వైఎస్సార్ టీపీ నాయకులు రాజుకుమార్, సత్యనారాయణ, రాంచందర్, రెక్కిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, శ్రవణ్, ఆకుల ప్రవీణ్, గీత తదితరులు పాల్గొన్నారు.