‘కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం’
దిశ, న్యూస్ బ్యూరో: నిజామాబాద్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఓట్లు మొత్తం 824 ఉన్నయనీ, ఇందులో అత్యధికంగా 532 ఓట్లు టీఆర్ఎస్ పార్టీవే కాగా, కాంగ్రెస్, బీజేపీలకు కేవలం 140, 85ఓట్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. […]
దిశ, న్యూస్ బ్యూరో: నిజామాబాద్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఓట్లు మొత్తం 824 ఉన్నయనీ, ఇందులో అత్యధికంగా 532 ఓట్లు టీఆర్ఎస్ పార్టీవే కాగా, కాంగ్రెస్, బీజేపీలకు కేవలం 140, 85ఓట్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. దీన్ని బట్టి కవిత సునాయాసంగా విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు.
Tags: nizamabad MLC candidate, kalvakuntla kavitha, minister prashanth reddy, TRS, local body votes,