ప్రతి వారం కోటి పారాసిటమల్ మందులు అందజేస్తాం

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ నియంత్రణకు తమవంతు బాధ్యతగా ప్రభుత్వానికి ప్రతి వారం కోటి పారాసిటమల్ (paracetamol)  మందులు (drugs) అందజేయనున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ( Granules India Limited) ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉమాదేవి చిగురుపాటి తెలిపారు. బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి పారాసిటమల్ మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ దేశ, విదేశాల్లో గ్రాన్యూల్స్ కంపెనీ ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా చేసి మన్ననలు పొందుతుందన్నారు. […]

Update: 2021-05-12 11:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ నియంత్రణకు తమవంతు బాధ్యతగా ప్రభుత్వానికి ప్రతి వారం కోటి పారాసిటమల్ (paracetamol) మందులు (drugs) అందజేయనున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ( Granules India Limited) ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉమాదేవి చిగురుపాటి తెలిపారు. బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి పారాసిటమల్ మందులు అందజేశారు.

ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ దేశ, విదేశాల్లో గ్రాన్యూల్స్ కంపెనీ ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా చేసి మన్ననలు పొందుతుందన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సామాజిక బాధ్యతగా కొవిడ్ నేపథ్యంలో పారాసిటమల్ మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నెలల్లో రూ.8కోట్ల విలువైన 16 కోట్ల పారాసిటమల్ టాబ్లెట్లను అందజేయనున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News