వలస కూలీలను ఆపలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వందల కిలోమీటర్లు నడుచుకుంటూ రాష్ట్రాలు దాటుతున్న వలస కూలీలకు అన్నపానీయాలు అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఆ పిటిషన్ విచారిస్తూ.. రోడ్లపై నడుస్తున్నవారందరినీ పర్యవేక్షించడం కోర్టుకు సాధ్యం కాదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వలస కూలీలను తాము ఆపలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. రోడ్లపై నడుస్తున్న వలస కార్మికులను గుర్తించి వారికి ఆహారం, ఆశ్రయం కల్పించేలా కేంద్రాన్ని పురమాయించాలని న్యాయవాది అలాఖ్ అలోక్ శ్రీవాస్తవ పిటిషన్ దాఖలు […]

Update: 2020-05-15 05:49 GMT

న్యూఢిల్లీ: వందల కిలోమీటర్లు నడుచుకుంటూ రాష్ట్రాలు దాటుతున్న వలస కూలీలకు అన్నపానీయాలు అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఆ పిటిషన్ విచారిస్తూ.. రోడ్లపై నడుస్తున్నవారందరినీ పర్యవేక్షించడం కోర్టుకు సాధ్యం కాదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వలస కూలీలను తాము ఆపలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. రోడ్లపై నడుస్తున్న వలస కార్మికులను గుర్తించి వారికి ఆహారం, ఆశ్రయం కల్పించేలా కేంద్రాన్ని పురమాయించాలని న్యాయవాది అలాఖ్ అలోక్ శ్రీవాస్తవ పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్రలో ట్రాక్స్‌పై పడుకున్న 16 మంది వలస కూలీలపై నుంచి ట్రైన్ దూసుకెళ్లిన ఘటననూ పిటషనర్ గుర్తుచేశారు. కాగా, వలస కార్మికుల విషయంపై రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవాలి.. దానిపై కోర్టు విచారించి నిర్ణయించడమెందుకు? అని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజయ్ కౌల్‌ల ధర్మాసనం ప్రశ్మించింది. ప్రతి వలస కార్మికుడిని మానిటర్ చేయడం కోర్టుకు సాధ్యం కాదని తెలిపింది. వాళ్లు నడక మానడం లేదని చెబుతూ.. వారిని ఎలా ఆపగలం? అని పేర్కొంది. మహారాష్ట్ర ఘటనను ఉటంకిస్తూ.. వలస జీవులు ట్రాక్స్‌పై పడుకునేటప్పుడు ఎవరైనా ఎలా అడ్డుకోగలరని ప్రశ్నించింది. అంతేకాదు, పిటిషనర్‌పైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులందరూ కేవలం పేపర్ క్లిప్పింగ్‌లు చదువుతున్నారని, వాటి ఆధారంగానే పిటిషన్‌లు వేస్తున్నారని ఈసడించుకున్నది. పేపర్ చదివి.. సమస్యను కోర్టు పరిష్కరించాలనుకోవడం సరికాదన్నది. ఆ సమస్యలను రాష్ట్రాలే పరిష్కరించుకోనివ్వండి.. కోర్టు ఎందుకు విచారించి నిర్ణయాలు తీసుకోవాలి అని ప్రశ్నించింది. ‘మీకు ప్రత్యేక పాస్‌లు ఇప్పిస్తాం.. మీరు వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయగలరా?’ అని అడిగింది.

కాగా, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా వాదిస్తూ.. వలస కార్మికుల కోసం సర్కారు ప్రత్యేకంగా ప్రయాణ సదుపాయాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరాక.. ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి వలస కూలీకి సొంతూరికి వెళ్లే అవకాశముంటుందని తెలిపారు. కానీ, తమ వంతు వచ్చే వరకు వేచి చూడకుంటే ఎలా? అని ప్రశ్నించారు. అలాగే సర్కారు ఏర్పాటు చేసిన విధానంలోనే ప్రయాణించాలని ప్రత్యేకంగా వారిపై ఒత్తిడి చేయలేం కదా.. అని అన్నారు.

Tags:    

Similar News