రైతు పండించిన ప్రతి గింజను కొంటాం: మారెడ్డి
దిశ, న్యూస్‌బ్యూరో: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరిట కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం పౌరసరఫరాల భవన్‌లో ఆయన మీడియా మాట్లాడుతూ గతేడాది రబీలో ఇదే సమయానికి 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ప్రస్తుతం 5వేల కేంద్రాలను ప్రారంభించి 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ధాన్యం దిగుబడులను బట్టి ప్రాధాన్యత క్రమంలో కొనుగోలు కేంద్రాలను […]
దిశ, న్యూస్‌బ్యూరో: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరిట కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం పౌరసరఫరాల భవన్‌లో ఆయన మీడియా మాట్లాడుతూ గతేడాది రబీలో ఇదే సమయానికి 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ప్రస్తుతం 5వేల కేంద్రాలను ప్రారంభించి 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ధాన్యం దిగుబడులను బట్టి ప్రాధాన్యత క్రమంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రబీలో 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు 22కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ నుంచి అనుకున్నసమయానికి కొత్త గన్నీబ్యాగులు రాకపోవడంతో పాటు పాత గన్నీ సంచుల రవాణాకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. బీహార్ నుంచి హమాలీలు రాలేకపోతుండటంతో ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్‌కు సమస్యలు వస్తున్నాయన్నారు.
Tags: paddy, rice millers, hamali workers, loading, bihar, west bengal, Mareddy Srinivas Reddy