రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
దిశ, మెదక్: ఒక వైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని మిట్టపల్లి, పొన్నాల, ఇర్కోడ్, చిన్నగుండవెల్లి, రాఘవాపూర్ గ్రామాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొంటున్నామన్నారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు టార్ఫలిన్ కవర్లు వెంట తెచ్చుకోవాలని […]
దిశ, మెదక్: ఒక వైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని మిట్టపల్లి, పొన్నాల, ఇర్కోడ్, చిన్నగుండవెల్లి, రాఘవాపూర్ గ్రామాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొంటున్నామన్నారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు టార్ఫలిన్ కవర్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. జడ్పీటీసీ శ్రీహరిగౌడ్ ఆధ్వర్యంలో చిన్నగుండవెళ్లి గ్రామంలో సఫాయి కార్మికులు, ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
Tags: minister harish rao, pady purchasing centers, medak news